ఆ ప్రొఫెసర్‌కు రూ.13 కోట్ల ఫెలోషిప్‌
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆ ప్రొఫెసర్‌కు రూ.13 కోట్ల ఫెలోషిప్‌

వాషింగ్టన్‌: భారత సంతతి అమెరికా ప్రొఫెసర్‌ ముబారక్‌ ఉస్సేన్‌ సయ్యద్‌ అరుదైన ఘనత సాధించారు. అమెరికాలో ప్రతిష్ఠాత్మక కెరీర్‌ ఫెలోషిప్‌ అవార్డ్‌ను సాధించారు. మెదడుపై చేస్తున్న ప్రయోగానికి గాను యూఎస్‌ నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ దీనిని ప్రదానం చేసింది. ఇందుకుగాను ఐదేళ్ల కాలంలో రూ.13 కోట్ల ఫెలోషిప్‌ ఆయనకు అందనుంది. కశ్మీర్‌కు చెందిన  ముబారక్‌ ఉస్సేన్‌ సయ్యద్‌, అమెరికా న్యూ మెక్సికో యూనివర్సిటీ న్యూరాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాకు చెందిన సయ్యద్‌ స్థానికంగానే విద్యనభ్యసించారు. జర్మనీలో తన పీహెచ్‌డీని పూర్తి చేశారు.

ఇదీ చదవండి..

హారిస్‌ను అభినందించిన పెన్స్‌

 మరిన్ని