కమలా హారిస్‌ ప్రమాణం: తమిళనాడులో సంబరాలు!
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కమలా హారిస్‌ ప్రమాణం: తమిళనాడులో సంబరాలు!

చెన్నై: అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆమె పూర్వీకుల గ్రామమైన తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లా తులసేంద్రిపురంలో పండగ వాతావరణం నెలకొంది. గ్రామంలో రహదారులను శుభ్రం చేసి కమలా హారిస్‌ ఫొటోలను ఏర్పాటు చేశారు. గ్రామస్థులు పిండి వంటలు చేసుకుని వేడుకలు జరుపుకొంటున్నారు. దుకాణాల్లో హారిస్‌, బైడెన్‌ ఫొటోలతో ఉన్న నూతన సంవత్సర క్యాలెండర్లు సైతం ఆవిష్కృతమవుతున్నాయి. గ్రామంలోని ప్రతి వీధిని అందంగా అలంకరించారు. అంతేకాకుండా ఆలయాల్లో కొందరు కమలా హారిస్‌ పేరు మీద ప్రార్థనలు కూడా చేయడం విశేషం. 

ఈ సందర్భంగా గ్రామస్థులు మీడియాతో మాట్లాడుతూ.. ‘అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇంత చిన్న గ్రామానికి సంబంధించిన మూలాలున్న మహిళ అమెరికా ఉపాధ్యక్షరాలిగా ఎన్నిక అయ్యారని తెలుసుకోవడం ఇక్కడి ప్రజల్లో ఆనందోత్సాహాలను కలిగిస్తోంది. దీంతో మా గ్రామమంతా ఈ రోజు ఎంతో ఆనందంగా ఉంది. గ్రామంలోని చాలా మంది మహిళలకు ఆమె ఆదర్శంగా నిలుస్తున్నారు.  మేం ఈ కార్యక్రమాన్ని ఓ పండగలా జరుపుకొంటున్నాం. ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఆస్వాదించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాం’ అని తెలిపారు. కమలా హ్యారిస్‌ తల్లి శ్యామలా గోపాలన్‌ తమిళనాడుకు చెందిన వారనే విషయం తెలిసిందే.

ఇదీ చదవండి

కమిటీ సభ్యులను కించపరుస్తారా:సుప్రీంకోర్టుమరిన్ని