నా హృదయం ముక్కలైంది: సత్యనాదెళ్ల
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
నా హృదయం ముక్కలైంది: సత్యనాదెళ్ల

వాషింగ్టన్‌: భారత్‌లో పరిస్థితి చూసి తన హృదయం ముక్కలైందని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల అన్నారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చిన అమెరికాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆక్సిజన్‌ పరికరాల కొనుగోలులో భారత్‌కు మద్దతిస్తామని చెప్పారు. భారత్‌కు సాయం చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ తన వనరులను ఉపయోగిస్తుందన్నారు. 

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా భారత్‌లోని కొవిడ్ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రోజురోజుకూ తీవ్రమవుతోన్న కొవిడ్ ఉద్ధృతి తమను షాక్‌కు గురిచేస్తున్నట్లు ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. అలాగే ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌కు సహాయమందించేందుకు రూ.135 కోట్ల సహాయ నిధిని ప్రకటించారు.


మరిన్ని