అమెరికాలో ఇక మాస్కు అక్కర్లేదు!
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అమెరికాలో ఇక మాస్కు అక్కర్లేదు!

వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి ఊరట
 సీడీసీ కొత్త మార్గదర్శకాలు

న్యూయార్క్‌: అమెరికాలో వ్యాక్సినేషన్‌ పూర్తయిన వాళ్లు ఇకపై మాస్కుల్లేకుండానే బయట తిరగొచ్చు. ఈ మేరకు సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) మంగళవారం సవరించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం.. వ్యాక్సినేషన్‌ పూర్తయినవారితో పాటు పాక్షికంగా జరిగినవారు ఇకపై బయట మాస్కుల్లేకుండా తిరగొచ్చు. ఒంటరిగా లేదా కుటుంబసభ్యులతో కలిసి నడకకు, వాహనాలపై షికారుకు వెళ్లొచ్చు. పూర్తి వ్యాక్సినేషన్‌ జరిగిన ప్రజల సమూహంలోకి కూడా వెళ్లొచ్చు. అయితే పెద్ద గుంపులోకి, కొత్త వ్యక్తుల సమూహంలోకి వెళ్లేప్పుడు మాస్కు ఉంటేనే మేలు. అదే సమయంలో వ్యాక్సిన్లు వేయించుకోనివారు మాత్రం ఇంటిబయట మాస్కులు ధరించడం కొనసాగించాలి.


మరిన్ని