ఈ-పోస్టల్‌ బ్యాలెట్‌పై విదేశాల్లో కార్యశాలలు
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఈ-పోస్టల్‌ బ్యాలెట్‌పై విదేశాల్లో కార్యశాలలు

ఎన్నికల సంఘానికి కేంద్రం సూచన

దిల్లీ: విదేశాల్లో ఉన్న భారతీయ ఓటర్లకు ఎలక్ట్రానిక్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. దీనిలో భాగంగా బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా సహా మరికొన్ని ఎంపిక చేసిన దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లోని సిబ్బందికి ఆ వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు కార్యశాలలు (వర్క్‌షాప్‌లు‌) నిర్వహించాలని ఎన్నికల సంఘానికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సూచించింది.

వెబినార్‌ రూపంలో నిర్వహించే ఈ కార్యశాలల విధివిధానాలను త్వరలో రూపొందించనున్నట్లు ఎన్నికల సంఘం వర్గాలు వెల్లడించాయి.  ఎలక్ట్రానిక్‌ విధానంలో పంపించే పోస్టల్‌ బ్యాలెట్‌ వ్యవస్థ (ఈటీపీబీఎస్‌) సదుపాయాన్ని విదేశాల్లో ఉన్న భారతీయ ఓటర్లకూ విస్తరింపజేయాలన్న ప్రతిపాదనను గత ఏడాది నవంబరు 27న ఎన్నికల సంఘం చేసింది. ఇప్పటి వరకూ ఈ వ్యవస్థ దేశంలోని అర్హులైన సర్వీసు ఓటర్లకు మాత్రమే ఉంది.

ఇవీ చదవండి..

ఒహైయో సెనేట్‌కు తొలిసారి భారత సంతతి వ్యక్తి

అమెరికాలో ఘనంగా కోటి సాయి గాయత్రి పఠనం


మరిన్ని