కాకర్ల మృతి పట్ల సతీశ్‌ వేమన సంతాపం  
కాకర్ల మృతి పట్ల సతీశ్‌ వేమన సంతాపం   

అమెరికా: ప్రముఖ వైద్యులు, తానా వ్యవస్థాపక అధ్యక్షులు, నిమ్్స మాజీ డైరెక్టర్‌ కాకర్ల సుబ్బారావు మృతి పట్ల తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన సంతాపం తెలిపారు. ఆయన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. తెలుగు ప్రజలు ఆంధ్రా నుంచి అమెరికాకు వచ్చేటప్పటికే కాకర్ల అక్కడ తనదైన ముద్రను వేశారన్నారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు‌ ఇచ్చిన పిలుపుతో మాతృభూమిలో సేవలందించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేశారని, ఆ తర్వాత నిమ్స్‌ బాధ్యతలు తీసుకున్నారని గుర్తు చేసుకున్నారు. నిమ్స్‌ను విజయవంతంగా తీర్చిదిద్దడంలో ఆయన ఎంత విజయవంతమయ్యారో చూశామన్నారు. తానాను స్థాపించినందుకు కాకర్ల సుబ్బారావుకు సతీష్‌ వేమన ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలోని ప్రతి తెలుగు సంస్థ, వ్యక్తీ ఈ రోజు ప్రత్యక్షంగానో, పరోక్షంగానే తానాతో సంబంధం కలిగి ఉన్నారన్నారు. తానా వ్యవస్థాపకులుగా, తొలి అధ్యక్షులుగా కాకర్ల వ్యవహరించడం తమకెంతో గర్వకారణమని పేర్కొన్నారు.


మరిన్ని