సౌదీ: అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల ఎత్తివేత
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
సౌదీ: అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల ఎత్తివేత

రియాద్‌: అంతర్జాతీయ ప్రయాణాలపై రెండు వారాలుగా అమల్లో ఉన్న ఆంక్షలను సౌదీఅరేబియా ఎత్తివేసింది. వైమానిక, జల, భూ మార్గాల ద్వారా తమ దేశంలో ప్రవేశాలపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తున్నట్టు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ వెల్లడించింది. బ్రిటన్‌లో వెలుగుచూసి పలు ఇతర దేశాల్లో కూడా బయటపడిన కొత్తరకం కరోనావైరస్‌ వ్యాప్తి కట్టడి కోసం.. ఆ దేశం రాకపోకలపై ఆంక్షలు విధించింది. తమ దేశంలో అంతర్జాతీయ ప్రయాణాల పునరుద్ధరణ స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 11 నుంచి ప్రారంభమయిందని ఆంతరంగిక వ్యవహారాలశాఖ ప్రకటించింది.

కొత్త కరోనా జాడలు ఉన్న దేశాల నుంచి వచ్చిన వారికి సంబంధించి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. సదరు దేశాల నుంచి వచ్చిన సౌదీపౌరులు రెండు సార్లు కొవిడ్‌ పరీక్షలను చేయించుకోవటంతో పాటు.. 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని స్థానిక అధికారులు వివరించారు. ఇక సౌదీ పౌరులు కానివారికి.. ఒకసారి కరోనా పరీక్ష,  14 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరని అధికారిక ప్రకటనలో సూచించింది. 

ఇవీ చదవండి..

లాస్‌ ఏంజెలెస్‌లో అంత్య క్రియలకూ కటకట

ట్రంప్‌.. ఆ ఆలోచన కూడా రానీయొద్దు!


మరిన్ని