సింగపూర్‌లో శత చండీ మహా యాగం
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
సింగపూర్‌లో శత చండీ మహా యాగం

ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం, కొవిడ్ మహమ్మారి పూర్తిగా అంతం కావాలని కోరుతూ సింగపూర్‌లోని వాసవీ క్లబ్‌ ఆధ్వర్యంలో చండీహోమం నిర్వహించారు. స్థానిక మహామారియమ్మన్ ఆలయంలో అంగరంగ వైభవోపేతంగా, శాస్త్రోక్తంగా ఈ యాగం చేశారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు, మంగళ ఆశీర్వచనాలు ఇచ్చారు.వాసవీ క్లబ్ అధ్యక్షులు అరుణ్ కుమార్ గొట్లూరి, కార్యదర్శి నరేంద్ర కుమార్ నారంశెట్టి సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు కోర్ కమిటీ సభ్యులైన రాజశేఖర్ గుప్తా, ముక్కా కిషోర్, ముకేష్ భూపతి, మురళి పబ్బతి, సేవాదళ్ సభ్యుడైన నరేష్ యాద తదితరులు సహకరించారు.

.

 

Tags :

మరిన్ని