తానా: తెలుగు దినపత్రికలు, తెలుగు ప్రామాణికత
తానా: తెలుగు దినపత్రికలు, తెలుగు ప్రామాణికత

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం సాహిత్య అంశాలపై జరిగే సమావేశం ఈనెల 25వ తేదీన కూడా జరగనుంది.  దృశ్యమాధ్యమాల ద్వారా జరిగే ఈ 12వ సమావేశంలో ప్రముఖులు ‘తెలుగు దినపత్రికలు, తెలుగు భాష ప్రామాణికత’పై చర్చించనున్నారు. ఈ సమావేశంలో దినపత్రిక సంపాదకులు ప్రసంగిస్తుండటం విశేషం. ప్రముఖ తెలుగు దినపత్రిక ‘ఈనాడు’ సంపాదకులు ఎం.నాగేశ్వరరావుతోపాటు ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకుడు కె.శ్రీనివాస్‌, మన తెలంగాణ దినపత్రిక సంపాదక మండలి సలహాదారు గార శ్రీరామమూర్తి, సాక్షి దినపత్రిక కార్యనిర్వాహక సంపాదకుడు దిలీప్‌రెడ్డి, ఏపీ కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం వ్యవస్థాపకుడు సతీశ్‌ చందర్‌ సమావేశం కానున్నట్లు తానా వెల్లడించింది.

తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్‌, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకుడు తోటకూర ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశాన్ని తానా టీవీ ఛానెల్‌, మన టీవీతోపాటు యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ల ద్వారా వీక్షించవచ్చు.


మరిన్ని