ఉత్సాహంగా సాగిన తెలుగు సాహిత్య సభ
ఉత్సాహంగా సాగిన తెలుగు సాహిత్య సభ

టొరంటో: ఉగాది పండగను పురస్కరించుకుని కెనడాలో నిర్వహించిన తెలుగు సాహిత్య సభ ఉత్సాహంగా సాగింది. ఈ సభను ‘తెలుగుతల్లి’, ‘టొరంటో తెలుగు టైమ్స్‌’ మాస పత్రికలు సంయుక్తంగా నిర్వహించాయి. దాదాపు 9గంటల పాటు 40మందికిపైగా కళాకారులతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జానపద గేయాలాపన, సాహిత్య ప్రసంగాలు, కవి సంగమం, కథా సమయం, సరదా క్విజ్ తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

తెలుగుతల్లి ఎడిటర్‌ రాయవరపు లక్ష్మీ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా సీనియర్ సాహితీవేత్తల్ని, సంగీత విద్వాంసుల్ని, సీనియర్ రచయితలని, సీనియర్ కవులని యువతకి పరిచయం చేసే లక్ష్యం నెరవేరిందన్నారు. ఈ సభను విజయవంతంగా నిర్వహించేందుకు తోడ్పాటు అందించిన అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు యువతలో ఉన్న ప్రతిభని వెలికితీసేందుకు ఈ కార్యక్రమం గొప్పగా పనిచేసిందని టొరంటో తెలుగు టైమ్స్ సంపాదకులు సర్దార్ ఖాన్ అభినందించారు.

కెనడాలో 1985లో కొమురవోలు సరోజ తెలుగుతల్లి పత్రికను స్థాపించారు. ప్రస్తుతం రాయవరపు లక్ష్మీ ఆధ్వర్యంలోని ఈ బృందం కెనడాలోని తెలుగువారికి సాహిత్యాన్ని దగ్గర చేస్తూ విశేష కృషి చేస్తోంది.


Advertisement

Advertisement


మరిన్ని