అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగింది : ట్రంప్‌ 
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగింది : ట్రంప్‌ 

వాషింగ్టన్‌ : అధ్యక్ష పదవీ బదలాయింపు విషయంలో మొండిగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆ దేశంలో తాజాగా జరిగిన ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటిని రిగ్గింగ్‌ ఎన్నికలుగా అభివర్ణించిన ట్రంప్‌.. ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మీడియా ఫేక్‌ కథనాల్లోనే బైడెన్‌ గెలిచినట్లు ఆయన పేర్కొన్నారు. దీన్ని తాను అంగీకరించనని ట్రంప్‌ తాజాగా ట్వీట్‌ చేశారు. ఎన్నికలకు సంబంధించిన ఫలితాలపై ప్రయాణం ఇంకా కొనసాగుతుందని పేర్కొన్నారు. నవంబరు 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌  పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి కావాల్సిన మెజార్టీ ఎలక్టోరల్‌ ఓట్లు సాధించిన విషయం తెలిసిందే.మరిన్ని