అమెరికాలో పెరిగిపోతున్న నిరుద్యోగం
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అమెరికాలో పెరిగిపోతున్న నిరుద్యోగం

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు ఆ దేశ కార్మికశాఖ వెల్లడించింది. నిరుద్యోగులకు అందించే ప్రయోజనాల కోసం గత వారం 61 వేల మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితంగా గతవారం 6.84 లక్షలుగా ఉన్న నిరుద్యోగుల దరఖాస్తులు ప్రస్తుతం 7.19 లక్షలకు చేరినట్లు కార్మికశాఖ పేర్కొంది. కరోనా అనంతరం వ్యాపారాలు పున:ప్రారంభమైనా ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురవుతున్నట్లు వెల్లడించింది. కరోనా ప్రారంభానికి ముందు 2.20 లక్షల మంది మాత్రమే నిరుద్యోగ ప్రయోజనాల కోసం నమోదుచేసుకున్నారని పేర్కొన్న ఆ శాఖ ప్రస్తుతం అది నాలుగు రెట్లు పెరిగినట్లు పేర్కొంది. అమెరికాలో చురుగ్గా సాగుతున్న టీకా పంపిణీల ప్రక్రియతో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోందన్న కార్మిక శాఖ.. క్రమంగా నిరుద్యోగ సమస్య తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.మరిన్ని