రామజోగయ్యశాస్త్రికి యూకే తెలుగు అసోసియేషన్‌ పురస్కారం
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
రామజోగయ్యశాస్త్రికి యూకే తెలుగు అసోసియేషన్‌ పురస్కారం

హైదరాబాద్‌: సుప్రసిద్ధ సినీ కవి వేటూరి సుందరరామ్మూర్తి జయంతి ఉత్సవాలను అంతర్జాలం వేదికగా ఆదివారం నిర్వహించారు. లండన్‌ కేంద్రంగా పనిచేసే యునైటెడ్‌ కింగ్‌డమ్‌-తెలుగు అసోసియేషన్‌, ‘వంశీ గ్లోబల్‌ అవార్డ్స్‌ (అమెరికా-ఇండియా) ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రముఖ సినీ కవి రామజోగయ్యశాస్త్రికి ‘వేటూరి సుందరరామ్మూర్తి వంశీ జాతీయ సాహితీ పురస్కారం-2021’ ప్రదానం చేశారు. అమెరికాకు చెందిన గాయని ఆకునూరి శారద నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో.. అలనాటి అందాలనటి జమున, ఏపీ శాసనసభ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, ప్రముఖ కవి సుద్దాల అశోక్‌తేజ, సినీ నేపథ్య గాయకులు జి.ఆనంద్, వేటూరి రవిప్రకాశ్, సినీ గేయ రచయిత భువనచంద్ర, డా.వంశీ రామరాజు పాల్గొని మాట్లాడారు.

ఇదీ చదవండి..

తారల రచనలను గుర్తు చేసుకున్న తానా


మరిన్ని