హెచ్‌1బి వీసాల జారీలో మరో ముందడుగు
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
హెచ్‌1బి వీసాల జారీలో మరో ముందడుగు

పూర్తయిన దరఖాస్తు ప్రక్రియ

 

వాషింగ్టన్‌: 2022 ఆర్థిక సంవత్సరానికి గానూ హెచ్‌1బి వీసాలకు సంబంధించి ప్రాథమిక ఎలక్ట్రానిక్‌ రిజిస్ట్రేషన్‌ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసినట్లు అమెరికా వెల్లడించింది. సరైన ఆధారాలతో సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి లాటరీ విధానం ద్వారా ఎంపిక చేయనున్నట్లు అమెరికా పౌరసత్వం వలసదారుల కేంద్రం (యూఎస్‌సీఐఎస్‌) పేర్కొంది. 

అమెరికా కంపెనీల్లో పనిచేయాలంటే విదేశీ వృత్తి నిపుణులకు హెచ్‌1బి వీసాలు తప్పనిసరికాగా వీటికి భారత్‌ సహా పలు దేశాల నుంచి గట్టి పోటీ ఉంది. ఏటా 65 వేల హెచ్‌1బి వీసాలు జారీ చేసేందుకు పరిమితి ఉంది. అమెరికాలో అడ్వాన్డ్స్‌ డిగ్రీ చేసినవారికి మరో 20 వేల వీసాలు జారీ చేస్తారు. 2021 డిసెంబర్‌ 31 వరకు లాటరీ విధానంలోనే హెచ్‌1బి వీసాల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.మరిన్ని