ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

వెల్లడించిన భారత్‌లోని యూఎస్‌ ఎంబసీ

దిల్లీ: అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని యూఎస్‌ కాన్సులేట్లలో సోమవారం నుంచి విద్యార్థి వీసాల ప్రక్రియ ప్రారంభమవుతుందని భారత్‌లోని యూఎస్‌ ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. కరోనా పరిస్థితుల్లో పరిమిత సంఖ్యలో విద్యార్థులకు వీసాలు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. అత్యవసర విద్యార్థి వీసాల ప్రక్రియను మొదట నిర్వహిస్తామని, కరోనా నిబంధనలు పాటిస్తూ వీసాల ప్రక్రియ కొనసాగిస్తామని యూఎస్‌ ఎంబసీ ప్రకటనలో పేర్కొంది.


మరిన్ని