టీకా తప్పనిసరేం కాదు: బైడెన్‌
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
టీకా తప్పనిసరేం కాదు: బైడెన్‌

వాషింగ్టన్‌: అమెరికా పౌరులంతా తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాలన్న నిబంధనేమీ ఉండబోదని ఆ దేశ కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. తాను మాత్రం బహిరంగంగా అందరి ముందు టీకా తీసుకుంటానని తెలిపారు. మాస్కులు ధరించడం కూడా తప్పనసరి చేయబోనని వెల్లడించారు. అయితే, మహమ్మారి నుంచి రక్షించుకోవాంటే మాస్కు ధరించడం అత్యసరమని.. ప్రతి ఒక్కరూ ధరించాలని మాత్రం విజ్ఞప్తి చేస్తానన్నారు.

టీకా అందరికీ ఉచితంగా అందజేయడంతో పాటు తర్వాత ఎటువంటి దుష్ప్రభావాలు తలెత్తినా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. మాస్కు ధరించడం, అదే సమయంలో వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి రానుండడంతో మరణాలు, కొత్త కేసులు భారీ ఎత్తున తగ్గిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తనతో పాటు, ముగ్గురు మాజీ అధ్యక్షులు బహిరంగంగా టీకా తీసుకోనున్నారని తెలిపారు. తద్వారా శాస్త్రవిజ్ఞానంపై ప్రజలకున్న విశ్వాసం ఇనుమడిస్తుందన్నారు. అలాగే ఇంకెవరిలోనైనా అనుమానాలుంటే తొలగిపోతాయన్నారు. 

మరోవైపు కరోనా మహమ్మారితో ప్రభావితమైన ప్రజలు, వ్యాపారాలకు దన్నుగా నిలిచేందుకు 900 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి ఆమోదం తెలపాలని కాంగ్రెస్‌ను బైడెన్ విజ్ఞప్తి చేశారు. తాను బాధ్యతలు స్వీకరించబోయే రోజైన జనవరి 20న జరిగే వేడుక వర్చువల్‌గా జరిగే అవకాశమే ఎక్కువగా ఉందని తెలిపారు.

ఇవీ చదవండి..

భారత్‌కు సైనిక సామగ్రి విక్రయానికి అమెరికా ఆమోదం

కెనడా జోక్యం మాకు ఆమోదయోగ్యం కాదు


మరిన్ని