నాట్స్ అధ్యక్షుడిగా విజయ్ శేఖర్ అన్నే
నాట్స్ అధ్యక్షుడిగా విజయ్ శేఖర్ అన్నే

నూతన కార్యనిర్వాహక కమిటీ నియామకం

వాషింగ్టన్‌: అమెరికాలో తెలుగువారికి అండగా ఉంటున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్‌) 2020-2022కు కొత్త కార్యనిర్వాహక కమిటీని ప్రకటించింది. నాట్స్ అధ్యక్షుడిగా విజయ్ శేఖర్ అన్నేకు పదవీ బాధ్యతలు కట్టబెట్టింది. డాలస్‌కు చెందిన బాపయ్య చౌదరి నూతి, న్యూజెర్సీకి చెందిన వంశీ వెనిగళ్ల, మిస్సోరికి చెందిన రమేశ్ బెల్లం, ఫ్లోరిడాకు చెందిన శ్రీనివాస్ మల్లాది ఉపాధ్యక్షులుగా సేవలు అందించనున్నారు. సెక్రటరీగా రంజిత్ చాగంటి, ట్రెజరర్‌గా మదన్ పాములపాటి, జాయింట్ సెక్రటరీగా జ్యోతి వనం, జాయింట్ ట్రెజరర్‌గా హేమంత్ కొల్ల బాధ్యతలు తీసుకున్నారు.

హెల్ప్‌లైన్‌ ఫండ్ రైజింగ్ వ్యవహారాలు రామ్ నరేశ్ కొమ్మనబోయిన, ఇండియా లైజన్- శ్రీని గొండి, మార్కెటింగ్- రవి గుమ్మడిపూడి, మెంబర్ షిప్- అశోక్ కుమార్ గుత్తా, స్పోర్ట్స్- చంద్రశేఖర్ ఎస్.కొణిదెల, మీడియా రిలేషన్స్ అండ్ సోషల్ మీడియా- శ్రీనివాస్ కాకుమాను, విమెన్ ఎంపవర్‌మెంట్- జయశ్రీ పెద్దిబొట్ల, ప్రోగ్రామ్స్- లక్ష్మి బొజ్జ ఆయా బాధ్యతలను చూడనున్నారు. వీరు నేషనల్ కో-ఆర్డినేటర్లుగా కొనసాగనున్నారు. కిరణ్ కొత్తపల్లి, కిరణ్ యార్లగడ్డ, రాజేశ్ కాండ్రు, భాను లంక, కృష్ణ నిమ్మగడ్డ, కోటేశ్వరరావు బోడెపూడి, రామ్ కొడితల జోనల్ వైస్ ప్రెసిడెంట్లుగా రెండేళ్ల పాటు పదవీ బాధ్యతలు నిర్వహించనున్నారు.

నాట్స్ ప్రధానంగా చేపట్టే కార్యక్రమాలకు జాతీయస్థాయలో కూడా సమన్వయకర్తలను నియమించింది. ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (వెబ్)గా సుధీర్ కుమార్ మిక్కిలినేని, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా రిలేషన్స్)గా మురళీ కృష్ణ మేడిచర్ల సేవలు అందించనున్నారు. హెల్ప్ లైన్ టీం మెంబర్ సతీష్ ముమ్మనగండి, జాతీయ హెల్ప్ లైన్ టీం మెంబర్ (గృహ హింస) కవిత దొడ్డా తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వహించనున్నారు. తెలుగు ప్రజలకు మరింత విశిష్టమైన సేవలు అందించడమే లక్ష్యంగా నాట్స్‌ను మరింత సంఘటితం చేస్తామని నూతన అధ్యక్షుడు విజయ్‌ శేఖర్‌ అన్నే పేర్కొన్నారు.

కొత్త కార్యనిర్వాహక కమిటీకి నాట్స్ ఛైర్మన్ శ్రీధర్‌ అప్పసాని అభినందనలు తెలిపారు. నూతన కార్యవర్గం నాట్స్ ఉన్నతిని మరింతగా పెంచుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలకు సేవ చేసేందుకు నాట్స్ ద్వారా వచ్చిన అవకాశాన్ని కార్యవర్గ సభ్యులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నాట్స్ కొత్త కార్యవర్గానికి నాట్స్ బోర్డు సెక్రటరీ ప్రశాంత్ పిన్నమనేని అభినందనలు తెలిపారు. గత రెండేళ్లలో శ్రీనివాస్ మంచికలపూడి నాయకత్వంలో నాట్స్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. అదే బాటలో కొత్త నాయకత్వం కూడా పనిచేస్తుందని ప్రశాంత్ పిన్నమనేని తెలిపారు.


మరిన్ని