అమరావతి రైతుల పోరాటంపై వెబినార్ 
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అమరావతి రైతుల పోరాటంపై వెబినార్  

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు తమకు జరిగిన అన్యాయంపై చేపట్టిన పోరాటం అవిశ్రాంతంగా కొనసాగుతోంది. న్యాయం కోసం వారు కోర్టుల్లో చేస్తున్న పోరాటంపై ప్రజలను మరింత చైతన్య పరిచేందుకు ఎందరో కృషిచేస్తున్నారు. వారిలో సీనియర్ న్యాయవాది నర్రా శ్రీనివాసరావు ఒకరు. రాజ్యాంగానికి, న్యాయస్థానానికి ఉన్న శక్తి (పవర్‌) తెలుసుకుంటేనే పోరాటంలో గెలవగలమని ఆయన అన్నారు. ఇదే విషయంపై నిర్వహించిన ఫ్రీ వెబినార్‌కు భారీ స్పందన లభించింది.

‘‘పోరాటం ఎంత అవగాహనతో చేస్తే అంత త్వరగా అమరావతి గెలుస్తుంది. అలా గెలవాలంటే న్యాయపరమైన విషయాలపై, క్షేత్రస్థాయి వాస్తవాలపై మనకు అవగాహన పట్టు ఉండాలి. పోరాటంపై పట్టుదల ఉండాలి’’ అంటూ వెబినార్‌కు హాజరైన వారికి పూర్తి స్థాయి అవగాహన కల్పించారు. జూమ్ ద్వారా జరిగిన ఈ వెబినార్‌లో ప్రముఖ ఎన్నారైలు, అనేక మంది తెలుగు ప్రజలు పాల్గొన్నారు. అమరావతి పోరాటం గురించి అనేక క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకున్నారు. జయరామ్ కోమటి, శేషు బాబు కానూరి, బుచ్చి రామ్ ప్రసాద్, భాను ప్రసాద్ యడ్లపాటి, సాయి, రమేష్, జానకిరామ్, మనోహర్ నాయుడు, శ్రీనివాస్, వెంకట్ తదితరులు ఈ వెబినార్‌కు హాజరయ్యారు. '#ఎన్నారైస్ ఫర్ అమరావతి', 'హెల్పర్స్ ఫౌండేషన్' ఈ వెబినార్ ఏర్పాటు చేయడంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమ నిర్వాహకులకు, హాజరైన వారికి, సహకరించిన వారికి, పోరాటంతో కలిసి నడుస్తున్నవారికి నర్రా శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

మరిన్ని