ఐపీఎల్‌లో అందాల రాణి ఎవరంటే.. తమన్నా వాహి

ఐపీఎల్‌లో అందాల రాణి ఎవరంటే.. తమన్నా వాహి

1/13

ఐపీఎల్‌లో వ్యాఖ్యాతగా అలరిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్న ఈ వ్యాఖ్యాత పేరు తమన్నా వాహి. గతేడాది నుంచి తన వ్యాఖ్యానంతో సందడి చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

2/13

తమన్నా పుట్టి పెరిగింది అబుదాబిలో. అక్కడే చదివి అక్కడే నివసిస్తున్నారు.

3/13

తమన్నాకు ఖాళీ సమయం దొరికితే విహారయాత్రలకు వెళుతుంటారు. వీలు చిక్కినప్పుడల్లా ఇతర దేశాల్లోని ప్రకృతిని ఆస్వాదిస్తూ పని ఒత్తిడిని జయిస్తారు.

4/13

ఇటీవల తన సన్నిహితులతో కలిసి మాల్దీవులకు వెళ్లిన సందర్భంగా చిరునవ్వులు చిందిస్తూ వావ్‌ అనిపించే ఫొటోకు ఫోజుచ్చారు.

5/13

తమన్నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అధిక సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. దీంతో వారిని అలరించేందుకు అప్పుడప్పుడు మైమరపించే ఫొటోలను అభిమానులతో పంచుకుంటారు.

6/13

దుబాయ్‌లో నైట్‌ లైఫ్‌ ఆస్వాదించడం కూడా ఆమె అభిరుచుల్లో ఒకటి. కళ్లు జిగేల్‌ మనే చీకటి వెలుగుల్లో అప్పుడప్పుడు ఇలా సరదా ఫొటోలు తీసుకుంటారు.

7/13

ఒక పక్క యాంకర్‌గా పనిచేస్తూనే మరోపక్క తనకిష్టమైన బ్లాగర్‌గానూ కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే 2017లో ‘బెస్ట్‌ ఏషియన్‌ యూఏఈ బ్లాగర్‌’ అవార్డు సొంతం చేసుకున్నారు.

8/13

తమన్నా ఇతర కార్యక్రమాల్లోనూ వ్యాఖ్యాతగా, హోస్ట్‌గా పనిచేస్తుంటారు. యూఏఈలో జరిగే మెగా ఈవెంట్లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు

9/13

తమన్నాకు వేడుకలన్నా.. ప్రత్యేకంగా తయారవ్వాలన్నా ఎంతో ఇష్టం. తన సన్నిహితులు, కుటుంబ సభ్యుల కార్యక్రమాలకు తప్పకుండా సమయం కేటాయిస్తారు.

10/13

స్టైలిష్‌, ఫ్యాషన్‌గా ఉండటం కూడా తమన్నాకు చాలా ఇష్టమని చెప్పొచ్చు. తన ఇన్‌స్టాగ్రామ్‌ నిండా ఇలాంటి ఫొటోలే దర్శనమిస్తాయి.

11/13

తమన్నాకు ఇష్టమైన రంగు నేవీ బ్లూ. ఈ నీలిరంగులో ఫ్యాషన్‌ దుస్తులంటే మరీను. ఇటీవల ఓ సందర్భంలో అలాంటి దుస్తుల్లోనే అలరించి సంబరపడ్డారు.

12/13

తమన్నా మంచి భోజన ప్రియురాలు కూడా. వివిధ రకాల ఆహారాన్ని తీసుకోవాలంటే మరీ ఇష్టం. కాంటినెంట్‌, సబ్‌ కాంటినెంట్‌ ఏ వంటకాలైనా రుచులు చూస్తుంటారు.

13/13

అందరి అమ్మాయిల్లాగే తమన్నాకు షాపింగ్‌ అంటే పిచ్చి. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ఎక్కడ ఏది నచ్చితే అది తన కలెక్షన్‌లో ఉండి తీరాల్సిందే.


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని