Bhupendra patel: గుజరాత్‌ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్‌ 

తాజా వార్తలు

Updated : 12/09/2021 20:20 IST

Bhupendra patel: గుజరాత్‌ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్‌ 

అహ్మదాబాద్‌: గుజరాత్‌ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్‌ ఎంపికయ్యారు. ఇవాళ సమావేశమైన భాజపా శాసనసభా పక్షం ఈ మేరకు భూపేంద్ర పటేల్‌ను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా విచ్చేసిన తోమర్‌, ప్రహ్లాద్‌ జోషి సమక్షంలో సీఎం ఎంపిక జరిగింది. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని భూపేంద్ర పటేల్‌ కోరారు. ప్రస్తుతం ఆయన ఘట్లోడియా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా  ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇప్పటి వరకు సీఎంగా ఉన్న విజయ్‌ రూపాణీ శనివారం గవర్నర్‌కు రాజీనామా లేఖ అందజేసిన విషయం తెలిసిందే. వచ్చే శాసనసభ ఎన్నికల్లో భాజపాను విజయతీరాలకు చేర్చడమే లక్ష్యంగా పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి మార్పు చేపట్టింది. సీఎం పీఠాన్ని పటేల్‌ సామాజిక వర్గానికి ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించడంతో ప్రఫుల్‌ పటేల్‌, మన్‌సుఖ్‌ మాండవీయ, సీఆర్‌ పాటిల్‌, నితిన్‌ పటేల్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ అనూహ్యంగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన భూపేంద్ర పటేల్‌ వైపే పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపింది.

గుజరాత్‌ మాజీ సీఎం, యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌కు సన్నిహితుడిగా భూపేంద్ర పటేల్‌కు పేరుంది. గతంలో ఆమె పోటీ చేసిన ఘట్లోడియా నుంచే 2017లో తొలిసారి పోటీ చేసిన ఆయన.. లక్షకు పైగా ఓట్లతో విజయం సాధించారు. గతంలో అహ్మదాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి ఛైర్మన్‌గానూ వ్యవహరించారు. అంతకుముందు అహ్మదాబాద్‌ కౌన్సిలర్‌గా పనిచేశారు. సోమవారం సీఎంతో పాటు నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేబినెట్‌లో కూడా కొత్త ముఖాలకు చోటు ఉంటుందని తెలుస్తోంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని