Congress: యూపీలో ‘హస్తం’ కొత్త వ్యూహం .. 12 వేల కి.మీల యాత్రకు నిర్ణయం!

తాజా వార్తలు

Published : 11/09/2021 02:12 IST

Congress: యూపీలో ‘హస్తం’ కొత్త వ్యూహం .. 12 వేల కి.మీల యాత్రకు నిర్ణయం!

లఖ్‌నవూ: గత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొన్న కాంగ్రెస్‌కు పునర్‌ వైభవం తీసుకొచ్చేందుకు ఆ పార్టీ కసరత్తులు చేస్తోంది. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా భారీ ప్రణాళికలు రచిస్తోంది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 12వేల కి.మీల మేర యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సారథ్యంలో ‘కాంగ్రెస్‌ ప్రతిజ్ఞ యాత్ర’ రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాలు, పట్టణాల మీదుగా ముందుకు సాగనుంది. 

మరోవైపు, ఎన్నికల సన్నద్ధతపై పార్టీ నేతలతో చర్చించేందుకు మూడు రోజుల పర్యటన నిమిత్తం కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా గురువారం లఖ్‌నవూకు చేరుకున్నారు. శుక్రవారం ఆమె పార్టీ సలహాదారులు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే ఎన్నికలకు ముందు రాష్ట్రంలో 12 వేల కి.మీల యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని పలు గ్రామాలు, పట్టణాల మీదుగా కొనసాగే ఈ యాత్రలో కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామంటూ ప్రజల ముందు ప్రతిజ్ఞ చేయనున్నారు. ఈ యాత్రకు రూట్‌లు, ఆయా ప్రాంతాల్లో సమస్యలకు సంబంధించి నేతల నుంచి ప్రియాంక సలహాలు, సూచనలు కోరారు. ఈ సమావేశంలో యూపీ అసెంబ్లీలో కాంగ్రెస్‌ సభాపక్ష నేత అరాధన మిశ్రా మోనా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అజయ్‌ కుమార్‌ లల్లూ, సీనియర్‌ నేత ప్రమోద్‌ తివారీ తదితరులు పాల్గొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని