Nitin Gadkari: రాజకీయ నేతలు సంతోషంగా ఉండరు: గడ్కరీ

తాజా వార్తలు

Published : 15/09/2021 02:03 IST

Nitin Gadkari: రాజకీయ నేతలు సంతోషంగా ఉండరు: గడ్కరీ

దిల్లీ: ఏస్థానంలో ఉన్నా రాజకీయ నేత ఆనందంగా ఉండబోరని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చలోక్తులు విసిరారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ సంతోషంగా ఉండరని.. ఎందుకంటే తన పదవి ఎప్పుడు పోతుందన్న అంశం వారికే తెలియదని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నితిన్‌ గడ్కరీ సోమవారం రాజస్థాన్‌ శాసనసభలో ‘పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజల అంచనాలు’ అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మంత్రులు కాలేకపోయారని ఎమ్మెల్యేలు సంతోషంగా ఉండరు. ఉత్తమ శాఖలు పొందలేకపోయామని మంత్రులు అసంతృప్తిగా ఉంటారు. ముఖ్యమంత్రి కాలేకపోయామని ఆ మంత్రులు బాధతో ఉంటారు. తన పదవి ఎంతకాలం ఉంటుందో తెలియక ముఖ్యమంత్రి ఆందోళనలో ఉంటారు’ అని పేర్కొన్నారు. దీంతో సమావేశంలో ఉన్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.

క్యూలో చివరిగా నిలబడి ఉన్న సామాన్యుడి జీవితంలో మార్పు తీసుకురావడమే రాజకీయాల అసలు లక్ష్యం. కానీ.. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో అది అధికారాన్ని చేజిక్కించుకునే మార్గంగా నిలుస్తోంది అని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి వైదొలిగిన కొద్ది రోజులకే గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గుజరాత్‌ సీఎంగా ఉన్న విజయ్‌ రూపాణి అకస్మాతుగా తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలోనే భాజపా అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని