Punjab Elections2022: పంజాబ్‌లో ఎన్నికల సందడి షురూ.. 64 మందితో అకాలీదళ్‌ తొలి జాబితా!

తాజా వార్తలు

Updated : 14/09/2021 03:40 IST

Punjab Elections2022: పంజాబ్‌లో ఎన్నికల సందడి షురూ.. 64 మందితో అకాలీదళ్‌ తొలి జాబితా!

చండీగఢ్‌: పంజాబ్‌లో ఎన్నికల సందడి మొదలైంది. వచ్చే ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే కసరత్తులు ప్రారంభించాయి. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా గెలుపు గుర్రాల ఎంపిక ప్రక్రియను షురూ చేశాయి. రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న శిరోమణి అకాలీదళ్‌ సోమవారం అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 64 మందితో తొలి జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన జలాలాబాద్‌ నుంచి బరిలో నిలవనున్నారు. తమ పార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు చెబుతూ సుఖ్‌బీర్‌ ట్వీట్‌ చేశారు. తమ పార్టీ అభ్యర్థుల విజయం.. అవినీతి, మోసంతో కూడిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వదిలించుకొనేందుకు ఉత్సాహంగా ఉన్న పంజాబీలకు అవకాశంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. 

మొత్తం 117 స్థానాలు ఉన్న పంజాబ్‌ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండగా.. ఆప్‌ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. శిరోమణి అకాలీదళ్‌ కూడా బలమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తోంది. మరోవైపు, పంజాబ్‌లో ఈసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆప్‌ జోరుగా పావులు కదుపుతోంది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 80 సీట్లు రాగా.. ఆప్‌ 16, శిరోమణి అకాలీదశ్‌ 14, భాజపా 2 స్థానాలు చొప్పున గెలుచుకున్నాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని