
తాజా వార్తలు
ఎన్టీఆర్‌లా కత్తిపట్టిన డేవిడ్ వార్నర్
ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుకుగా ఉంటాడు. తెలుగు సినిమాల్లో ఎంతో క్రేజ్ సంపాదించిన సన్నివేశాలను సరదాగా అనుకరిస్తూ అభిమానులతో పంచుకుంటుంటాడు. తాజాగా ప్రముఖ హీరో ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రంలోని ఫైట్ సన్నివేశాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. అయితే ఈ వీడియోలో వార్నర్ ఎన్టీఆర్‌ను అనుకరించలేదు. సాంకేతిక సాయంతో ఎన్టీఆర్ స్థానంలో అతడు కనిపించేలా వీడియోను ఎడిట్ చేసి పోస్ట్ చేశాడు. ‘‘ఇది ఎలా ఉందో చూద్దాం. ఇది ఏ సినిమాలోని సన్నివేశం? హీరో ఎవరని చెప్పగలరా? ఎక్కువ మంది సమాధానం చెప్పలేరనుకుంటా’’ అని దానికి వ్యాఖ్య జత చేశాడు.
కాగా, ఈ వీడియోకి విశేషాదరణ లభిస్తోంది. పోస్ట్ చేసిన కొద్దిక్షణాల్లోనే లైకులు పోటెత్తాయి. అయితే కామెంట్లలో అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు వార్నర్ సమాధానమిచ్చాడు. బాహుబలి-3లో హీరోగా నటిస్తారా అని అడిగిన ప్రశ్నకు ‘డైలాగ్స్‌లో సాయం చేస్తే నటిస్తా’ అని బదులిచ్చాడు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు సెలవులు అడిగి టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వండి అని ఓ నెటిజన్ అడగ్గా.. ‘వాళ్లు ఒప్పుకుంటారని మీరు భావిస్తున్నారా’ అని రిప్లై ఇచ్చాడు. మరో అభిమాని ప్రశ్నకు ‘హైదరాబాద్‌లోని ప్రతిఒక్కరిని ఎంతో మిస్ అవుతున్నా’ అని జవాబు చెప్పాడు. ఐపీఎల్లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్నర్‌కు తెలుగు అభిమానులతో మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- నాన్‌స్టాప్ ‘ఫన్’షూట్.. లంగాఓణి ‘ఉప్పెన’ రాణి
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
- టీకా పంపిణీలో భారత్ ప్రపంచ రికార్డ్!
- మరో 6 పరుగులు చేసుంటే..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
