Tokyo Olympics: ఒలింపిక్‌ గోల్డ్‌మెడలిస్ట్‌కు షాకిచ్చి.. ప్రీక్వార్టర్స్‌కు ఆర్చర్‌ అతాను దాస్‌..

తాజా వార్తలు

Updated : 29/07/2021 09:13 IST

Tokyo Olympics: ఒలింపిక్‌ గోల్డ్‌మెడలిస్ట్‌కు షాకిచ్చి.. ప్రీక్వార్టర్స్‌కు ఆర్చర్‌ అతాను దాస్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: పురుషుల ఆర్చరీలో భారత క్రీడాకారుడు అతాను దాస్‌ ప్రీక్వార్టర్స్‌కు చేరుకొన్నారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో జరిగిన ఎలిమినేషన్‌ రౌండ్‌ పోరులో ఆయన చైనీస్‌ తైపీకి చెందిన యూ చెంగ్‌ డెంగ్‌పై 6-4 తేడాతో విజయం సాధించారు. ఆయన తర్వాతి రౌండ్‌లో కొరియా ఆర్చర్‌ జిన్‌హెక్‌పై 6-5 తేడాతో సంచలన విజయం సాధించారు. లండన్‌ ఒలిపింక్స్‌లో జిన్‌ హెక్‌ స్వర్ణపతక విజేత కావడం విశేషం. దీంతో రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ఆయన ప్రీక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు.

నేడు టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ పలు క్రీడల్లో విజయం సాధించింది. మహిళల బ్యాడ్మింటన్‌లో పి.వి.సింధు, పురుషుల హాకీ జట్టు, ఇప్పుడు అర్చరీలో అతాను దాసు ముందజ వేసి పతకంపై ఆశలు పెంచారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని