మహిళా జట్టు హెడ్‌కోచ్‌గా రమేశ్‌ పొవార్‌
close

తాజా వార్తలు

Published : 13/05/2021 21:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహిళా జట్టు హెడ్‌కోచ్‌గా రమేశ్‌ పొవార్‌

ఇంటర్నెట్ డెస్క్‌: భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్‌ కోచ్‌గా టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్‌ రమేశ్ పొవార్‌ ఎంపికయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. ఈ పదవి కోసం 35 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎనిమిది మంది షార్ట్‌ లిస్ట్‌కు ఎంపికయ్యారు. ఈ జాబితాలో ప్రస్తుత మహిళల జట్టు కోచ్‌ డబ్ల్యూ.వి.రామన్‌, రమేశ్‌ పొవార్‌, భారత మాజీ ఆటగాళ్లు అజయ్ రాత్రా, రిషికేశ్‌ కనిక్కర్‌లతో పాటు మహిళా అభ్యర్థులుగా మమత మబేన్‌, దేవికా వైద్య, హేమలత కళ, మాజీ అసిస్టెంట్ కోచ్‌ సుమ శర్మ ఉన్నారు.

సులక్షణ నాయక్‌, మదన్‌లాల్, ఆర్పీ సింగ్ సభ్యులుగా ఉన్న క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించింది. షార్ట్ లిస్ట్‌లో ఉన్న ప్రతి ఒక్కరినీ 30 నిమిషాల పాటు ఇంటర్వ్యూ చేసిన కమిటీ.. రమేశ్ పొవార్‌ను హెడ్‌ కోచ్‌గా ఎంపిక చేయాలని నిర్ణయించింది. రమేశ్‌ పొవార్‌ 2018లో జులై నుంచి నవంబర్‌ వరకు భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్‌ కోచ్‌గా పనిచేశాడు. పవార్‌ టీమిండియా తరఫున 2 టెస్టులు, 31 వన్డేలు ఆడాడు. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌ఏసీ) బౌలింగ్‌ కోచ్‌గా పనిచేసిన అనుభవముంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని