రామ్‌చరణ్‌ స్టైల్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌

తాజా వార్తలు

Published : 03/07/2021 20:40 IST

రామ్‌చరణ్‌ స్టైల్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఎప్పుడూ ఏదో ఒక హీరో సినిమాకు సంబంధించిన వీడియోలతో తన ముఖాన్ని స్వాపింగ్‌ చేస్తూ ఆకట్టుకునే వార్నర్‌ ఈసారి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌ను అనుకరించాడు. వినయ విధేయ రామ సినిమాలోని ఫైటింగ్‌ వీడియో క్లిప్పింగ్‌కు తన ముఖాన్ని జోడించి అద్భుతంగా తీర్చిదిద్దాడు. అందులో చెర్రీలా ఫైటింగ్‌, డైలాగులు చెప్పి అభిమానులకు కనులవిందు చేశాడు. దాన్ని శనివారం ఇన్‌స్టా్గ్రామ్‌లో పంచుకోవడంతో తెగ లైకులు, కామెంట్లు వస్తున్నాయి.

కాగా, వార్నర్‌ ఏడాది కాలంగా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి టిక్‌టాక్‌ వీడియోలు రూపొందించాడు. వాటికి మంచి ఆదరణ లభించడంతో మరిన్ని ప్రయోగాలు చేస్తూ భారతీయ సినిమాల టాప్‌ హీరోల వీడియోలకు తన ముఖాన్ని జోడించి ఆకట్టుకునేవాడు. ఈ క్రమంలోనే ప్రముఖ తెలుగు హీరోలు ప్రభాస్‌, మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌, అల్లుఅర్జున్‌ నటించిన సినిమాల పాటలు, డైలాగులకు తన నటనా కౌశల్యాన్ని ప్రదర్శించాడు. ఇప్పుడు తాజాగా రామ్‌చరణ్‌లా మెప్పించాడు. ఇదిలా ఉండగా, వార్నర్‌ ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్‌తో జరుగుతున్న పరిమిత ఓవర్ల క్రికెట్‌కు అతడు అందుబాటులో లేడు. మరోవైపు ఐపీఎల్‌ 14వ సీజన్‌లో మంచి ప్రదర్శన చేయకపోవడంతో సన్‌రైజర్స్‌ టీమ్‌ అతడిని కెప్టెన్‌గా తొలగించింది. కరోనా కారణంగా ఆ టోర్నీ వాయిదాపడటంతో వార్నర్‌ ఇంటికి చేరుకున్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని