T20 World Cup: పాజిటివ్‌ వస్తే పది రోజుల ఐసొలేషన్‌

తాజా వార్తలు

Updated : 10/10/2021 07:28 IST

T20 World Cup: పాజిటివ్‌ వస్తే పది రోజుల ఐసొలేషన్‌

టీ20 ప్రపంచకప్‌ బబుల్‌ మార్గదర్శకాలు

దుబాయ్‌: కరోనా మహమ్మారి తర్వాత ఐసీసీ నిర్వహించే తొలి ప్రపంచకప్‌నకు సమయం దగ్గర పడుతోంది. యూఏఈ, ఒమన్‌ వేదికలుగా జరిగే పురుషుల టీ20 ప్రపంచకప్‌ ఈ నెల 17న ఆరంభం కానుంది. కొవిడ్‌ నేపథ్యంలో పటిష్ఠమైన బబుల్‌లో నాలుగు వేదికల్లో ఈ 16 జట్ల పోరాటానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు ఐసీసీ సమగ్రత, బయో రక్షణ విభాగాధిపతి అలెక్స్‌ మార్షల్‌ తెలిపాడు. రెండు దేశాల్లోని నాలుగు వేదికల్లో టోర్నీని నిర్వహించడం క్లిష్టతరమైందని అతనన్నాడు. బబుల్‌లో ఎవరైనా పాజిటివ్‌గా తేలితే వాళ్లను 10 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచనున్నట్లు వెల్లడించాడు. ‘‘బబుల్‌లో పాజిటివ్‌గా తేలిన వాళ్లు లక్షణాలు లేకపోయినప్పటికీ పది రోజుల ఐసొలేషన్‌లో కచ్చితంగా ఉండాలి. వాళ్లతో సన్నిహితంగా మెలిగిన వాళ్లు ఆరో రోజులు ఐసొలేషన్‌లో గడపాల్సిందే. బబుల్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తాం. ఎవరైనా వాటిని ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తాం. ఈ టోర్నీ ఎంత ముఖ్యమో ఆటగాళ్లు అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉంది. ఎవరూ నిబంధనలు అతిక్రమించరనే అనుకుంటున్నా. పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులను ఆటగాళ్లతో కలిసి ఉండేందుకు అనుమతించాం. క్రికెటర్లు ఒత్తిడిని తగ్గించుకుని ఆటను ఆస్వాదించేందుకు కుటుంబ సభ్యులు దగ్గరగా ఉండడం అవసరం. ప్రేక్షకుల విషయంలో స్థానిక ప్రభుత్వాల నిబంధనల మేరకే నడుచుకుంటాం. ఒమన్‌, అబుదాబిలో మ్యాచ్‌లు చూసేందుకు స్టేడియాలకు రావాలనుకునే వాళ్లు కచ్చితంగా రెండు డోసుల టీకా తీసుకుని ఉండాలి. దుబాయ్‌, షార్జాలో అయితే అవసరం లేదు. ఏ స్టేడియంలోనైనా ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాల్సిందే’’ అని అలెక్స్‌ పేర్కొన్నాడు.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని