Gautam gambhir: కనీసం ఫొటోలోనైనా నవ్వొచ్చు కదా!

తాజా వార్తలు

Published : 29/07/2021 17:54 IST

Gautam gambhir: కనీసం ఫొటోలోనైనా నవ్వొచ్చు కదా!

గౌతమ్‌ గంభీర్‌ ఫొటోకు యువరాజ్‌ ఫన్నీ కామెంట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక్కోసారి అంతే.. సామాజిక మాధ్యమాల్లో మనం పెట్టిన ఫొటో కన్నా కింద కామెంట్‌ సెక్షన్లలో పెట్టే కామెంట్లే వైరల్‌ అవుతుంటాయి. అందులో కొన్ని వివాదాలకు దారి తీస్తే.. మరికొన్ని నవ్విస్తాయి. అంతే కాదు.. దీనిపై నెటిజన్ల చర్చలూ కొనసాగుంటాయి. తాజాగా టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్ గంభీర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఫొటో అభిమానులతో పంచుకున్నారు. ఇందులో తెల్ల దుస్తులు ధరించి.. సముద్రం దగ్గర నిలబడి స్టైల్‌గా పోజిచ్చాడు. నీలా ఎవరూ ఉండేలేరు.. అదే నీ ప్రత్యేకత!! అని క్యాప్షన్‌ని జత చేశాడు. అంతే.. ఆ ఫొటో చూసిన టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ వెంటనే తన కామెంట్‌తో గౌతమ్‌పై పంచ్‌ విసిరాడు.  

గౌతమ్‌ గంభీర్‌ క్రికెట్‌ మైదానంలోనే కాదు.. బయటా చాలా సింపుల్‌గా.. ఎలాంటి హడావుడి చేయకుండా ఉంటాడు. ఆయన ముఖంలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్లు ఎక్కువగా కనిపించవు. ఆ ఫొటోలోనూ ఇదే గమనించిన యూవీ ‘‘ మిత్రమా... కనీసం ఫొటోలోనైనా నవ్వొచ్చుగా’’ అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. గతంలో గౌతమ్‌ ఫీల్డింగ్ చేసిన ఫొటోకి.. ‘‘క్యాచ్‌ అయితే పట్టుకోలేకపోయా కానీ.. కెమెరా చక్కటి ఎక్స్‌ప్రెషన్‌ను బంధించింది’’ అంటూ క్యాప్షన్‌ పెడితే.. వెంటన  హర్భజన్‌ సింగ్‌ ‘’ నీ ఎక్స్‌ప్రెషన్‌కి బౌలర్‌ ఎలా స్పందించి ఉంటాడో చూడాల్సిందే’’ అంటూ కామెంట్‌ చేశాడు. ఏదేమైనా గౌతమ్‌ గంభీర్‌ ఫొటోలకు టీమ్‌ ఇండియా ఆటగాళ్ల కామెంట్లతో నవ్వుల తెప్పించే హాస్యాన్ని పండిస్తున్నారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని