cricket: 1983 కపిల్‌ డెవిల్స్‌ ఇతిహాసానికి 38 ఏళ్లు!
close

తాజా వార్తలు

Published : 25/06/2021 12:53 IST

cricket: 1983 కపిల్‌ డెవిల్స్‌ ఇతిహాసానికి 38 ఏళ్లు!

మధుర స్మృతిని గుర్తుచేసుకుంటున్న అభిమానులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎంత గొప్ప ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ఆరంభమవుతుంది. ముగింపు లేని ఈ గమనంలో ఎన్నెన్నో మైలురాళ్లు దాటేస్తాం. ఎన్నో ఘనతలు సాధిస్తాం. ప్రయాణించిన దూరం ఎంతైనా.. వేసిన మొదటి అడుగే ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

టీమ్‌ఇండియా అందుకున్న మొదటి ప్రపంచకప్‌ సైతం అలాంటిదే. టీ20, వన్డే, ఛాంపియన్స్‌ ట్రోఫీ, ఆసియా కప్పులు ఎన్ని గెలిచినా కపిల్‌ డెవిల్స్‌ ముద్దాడిన మొదటి ప్రపంచకప్‌ అందరి హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది.

1983, జూన్ 25న, సరిగ్గా ఇదే రోజున టీమ్‌ఇండియా తొలి ప్రపంచకప్‌ అందుకుంది. ఆ ఘనత సాధించి నేటికి 38 ఏళ్లు. ఈ మధ్య కాలంలో ఎంఎస్‌ ధోనీ నాయకత్వంలో భారత్‌ 3 ఐసీసీ ట్రోఫీలు అందుకుంది. అయినా అభిమానులు మాత్రం కపిల్‌ డెవిల్స్‌ విజయాన్నే ఇప్పటికీ స్మరిస్తుంటారు.

బీసీసీఐ, క్రికెటర్లు, అభిమానులు ఆనాటి మధుర స్మృతులను మరోసారి నెమరు వేసుకుంటున్నారు. ‘1983లో ఈరోజు: భారత క్రికెట్లో ఇదో చరిత్రాత్మకమైన రోజు. కపిల్‌ దేవ్‌ సారథ్యంలోని టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ ట్రోఫీ గెలిచింది’ అని బీసీసీఐ ట్వీట్‌ చేసింది. ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు, క్రికెటర్లు సైతం సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు.

ఆ ప్రపంచకప్‌ ఫైనల్‌లో టీమ్‌ఇండియా.. పటిష్ఠమైన వెస్టిండీస్‌తో తలపడింది. టాస్‌ ఓడిన కపిల్‌సేన మొదట బ్యాటింగ్‌ చేసి 183 పరుగులే చేసింది. విండీస్‌ విధ్వంసకరమైన బౌలింగ్‌ దాడికి నిలిచి క్రిస్‌ శ్రీకాంత్‌, మొహిందర్‌ అమర్‌నాథ్‌, సందీప్‌ పాటిల్‌ పరుగులు చేశారు. ఛేదనలో వివ్‌ రిచర్డ్స్‌, జెఫ్‌ డుజాన్‌ నిలిచినా.. మదన్‌ లాల్‌, అమర్‌నాథ్‌ చెరో 3 వికెట్లు తీసి 43 పరుగుల తేడాతో భారత్‌కు విజయం అందించారు. విండీస్‌ను 140 పరుగులకే పరిమితం చేశారు.












Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని