T20 World Cup: ప్రపంచకప్‌ విజేతకు ప్రైజ్‌మనీ ప్రకటించిన ఐసీసీ.. ఎంతో తెలుసా?

తాజా వార్తలు

Published : 10/10/2021 21:05 IST

T20 World Cup: ప్రపంచకప్‌ విజేతకు ప్రైజ్‌మనీ ప్రకటించిన ఐసీసీ.. ఎంతో తెలుసా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ పోటీలు మరికొద్ది రోజుల్లో క్రికెట్‌ ప్రేమికులను అలరించనున్నాయి. ఈ పొట్టి ఫార్మాట్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒమన్‌, యూఏఈలో ఈనెల 17 నుంచి ఈ పోటీలు మొదలై నవంబర్‌ 14న ముగియనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచకప్‌ విజేతకు ఐసీసీ తాజాగా ప్రైజ్‌మనీ ప్రకటించింది. విజేత జట్టు 16 లక్షల డాలర్లు (దాదాపు రూ. 12కోట్లు) స్వదేశానికి తీసుకెళుతుందని ఐసీసీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. రన్నరప్‌ టీమ్‌కు దాదాపు రూ. 6కోట్లు దక్కనున్నట్లు తెలిపింది.

16 జట్లు పోటీ పడుతున్న ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న జట్ల కోసం ఐసీసీ 5.6 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 42కోట్లు) వెచ్చిస్తోంది. టోర్నీలో పాలుపంచుకున్నందుకు ఒక్కో జట్టుకు ఐసీసీ కొంత సొమ్ము చెల్లించనుంది. వీటిల్లోంచి సూపర్‌ 12 లోని ప్రవేశించిన టీమ్‌లకు దాదాపు రూ. 52.50 లక్షలు అదనంగా దక్కనున్నాయి. నవంబర్‌ 10, 11న జరిగే సెమీఫైనల్లో ఓటమిపాలైన రెండు జట్లు 4 లక్షల డాలర్లు (దాదాపు రూ. 3కోట్లు) అందుకోనున్నాయి. 2016 ప్రపంచకప్‌ మాదిరిగానే.. సూపర్‌ 12లోకి అడుగుపెట్టిన తర్వాత గెలిచిన ప్రతి మ్యాచ్‌లో జట్టుకు బోనస్‌ అమౌంట్‌ దక్కనుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని