Tokyo Olympics: క్వార్టర్స్‌కు దీపిక.. మను, ద్యుతికి నిరాశ

తాజా వార్తలు

Published : 30/07/2021 10:40 IST

Tokyo Olympics: క్వార్టర్స్‌కు దీపిక.. మను, ద్యుతికి నిరాశ

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌ రెండో పతకం ఖాయం చేసుకున్న భారత్‌కు ఇతర క్రీడా విభాగాల్లో మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి. ఆర్చరీలో దీపికా కుమారి క్వార్టర్స్‌కు దూసుకెళ్లగా.. షూటింగ్‌లో మనుబాకర్‌కు నిరాశే ఎదురైంది. అటు స్ప్రింటర్‌ ద్యుతి చంద్‌ కూడా ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.

మహిళల ఆర్చరీ వ్యక్తిగత పోటీల్లో వరల్డ్‌ నంబరు వన్‌ ఆర్చర్‌ దీపికా కుమారి క్వార్టర్స్‌ చేరుకుంది. శుక్రవారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్‌ సెనియా పెరోవాపై 6-5తో విజయం సాధించింది. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పోటీల్లో చివరి ఎనిమిదికి చేరిన తొలి ఆర్చర్‌ ఈమే కావడం విశేషం.

షూటింగ్‌ గురి తప్పింది..

మరోవైపు భారత్‌ షూటర్లు మనుబాకర్‌, రహి సర్నోబత్‌ నిరాశపర్చారు. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ రెండో అర్హత పోటీల్లో మను 582 స్కోరుతో 15 స్థానంలో నిలిచింది. దీంతో ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఆమె సహచరిణి రహి 32 స్థానానికి పరిమితమైంది.

ఇక బాక్సింగ్‌లో మరో భారత బాక్సర్‌ సిమ్రన్‌జిత్‌ కౌర్‌కు కూడా నిరాశే ఎదురైంది. 60 కిలోల విభాగంలో థాయ్‌లాండ్‌ బాక్సర్‌ చేతిలో 0-5తో ఓటమిపాలైంది.

ద్యుతి.. 7 స్థానంలో..

ఎన్నో అంచనాల నడుమ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన స్ప్రింటర్‌ ద్యుతి చంద్‌ కూడా సెమీఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. శుక్రవారం జరిగిన 100మీటర్ల అర్హత పోటీల్లో ద్యుతి హీట్‌ 5లో ఏడో స్థానంలో.. ఓవరాల్‌గా 45 స్థానంలో నిలిచింది. అయితే 200మీటర్ల రేసులోనూ ఆమె పోటీ పడనుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని