Tokyo Olympics: అమ్మాయిలు.. శెభాష్‌! మా మనసులు గర్వంతో నిండిపోయాయి!

తాజా వార్తలు

Published : 02/08/2021 14:39 IST

Tokyo Olympics: అమ్మాయిలు.. శెభాష్‌! మా మనసులు గర్వంతో నిండిపోయాయి!

మహిళల హాకీ జట్టుకు అభినందనల వెల్లువ

దిల్లీ: ఒలింపిక్స్‌ చరిత్రలో తొలిసారి సెమీస్‌కు దూసుకెళ్లిన భారత మహిళల హాకీ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సెమీస్‌లోనూ అర్జెంటీనాను ఓడించి పతకం ఖాయం చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. రాజకీయ నాయకుల నుంచి ప్రముఖుల వరకు అమ్మాయిలను ప్రశంసిస్తున్నారు. సోమవారం జరిగిన క్వార్టర్స్‌లో టీమ్‌ఇండియా 1-0 తేడాతో మూడుసార్లు విజేత ఆసీస్‌ను ఓడించిన సంగతి తెలిసిందే.

 పురుషులతో పోలిస్తే మహిళల జట్టుదే గొప్ప విజయం. అమ్మాయిల ఫిట్‌నెస్‌, సామర్థ్యం గణనీయంగా పెరిగాయి. ఇప్పటి ఆటలో కొనసాగాలంటే శారీరక దృఢత్వం తప్పనిసరి. దుర్భేద్యమైన జట్టుపై చేసిన ఒక్క గోలైనా అద్భుతమే. గుర్జీత్‌ కౌర్‌ అత్యుత్తమ ఫామ్‌లో లేదు. అదృష్టమూ కలిసొచ్చింది. ఏదేమైనా భారత్‌కు గోల్‌ అవసరం. మున్ముందు మరింత బాగా ఆడాలి - వీరెన్‌ రస్‌ఖిన్హా, హాకీ మాజీ ఆటగాడు

➢ అద్భుతమైన ప్రదర్శన!!! టోక్యోలో భారత మహిళల జట్టు తమ ప్రతి అడుగు ద్వారా చరిత్ర లిఖిస్తున్నారు. ఆస్ట్రేలియాను ఓడించిన మనం తొలిసారి సెమీస్‌కు చేరుకున్నాం - అనురాగ్‌ ఠాకూర్‌, కేంద్ర క్రీడల మంత్రి

➢ భారత్‌ కల నిజమవుతోంది! మన మహిళల హాకీ జట్టు ఆస్ట్రేలియాను ఓడించింది! భారత పురుషులు, మహిళల జట్లు సెమీస్‌ చేరుకున్నాయి. నా సంతోషం, ఉత్సాహాన్ని పంచుకొనేందుకు నా వద్ద మాటల్లేవ్‌! - కిరణ్‌ రిజిజు, కేంద్ర మాజీ క్రీడల మంత్రి

➢ ఆస్ట్రేలియాపై క్వార్టర్‌ ఫైనల్లో అద్భుత విజయం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు అభినందనలు. ఈ జట్లు ఇలాగే గెలిచి దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలి. మున్ముందు బాగా ఆడాలి - నవీన్‌ పట్నాయక్‌, ఒడిశా సీఎం

➢ భారత హాకీ మహిళల జట్టు సెమీస్‌కు చేరుకున్నందుకు అభినందనలు. మీరు భారత్‌ను గర్వపడేలా చేశారు. తర్వాతి మ్యాచ్ గెలవాలని కోరుకుంటున్నా - రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాఠోడ్‌, కేంద్ర మాజీ క్రీడల మంత్రి

➢ మన అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. క్వార్టర్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాను 1-0తో ఓడించారు. తొలిసారి సెమీస్‌కు చేరుకున్నారు - వీవీఎస్‌ లక్ష్మణ్‌

➢ ఈ రోజు ఎంత అద్భుతంగా ఆరంభమైందో! మన అమ్మాయిల జట్టు సెమీస్‌ చేరుకోవడం భారత హాకీ చరిత్రలో మర్చిపోలేని సందర్భం. క్వార్టర్స్‌లో 1-0తో ఆస్ట్రేలియాను చిత్తు చేశారు - జే షా, బీసీసీఐ కార్యదర్శి
















Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని