IND vs PAK: భారత్‌పై గెలిచి శుభారంభం చేయాలనుకుంటున్నాం: బాబర్

తాజా వార్తలు

Published : 14/10/2021 10:21 IST

IND vs PAK: భారత్‌పై గెలిచి శుభారంభం చేయాలనుకుంటున్నాం: బాబర్

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాపై విజయం సాధించి శుభారంభం చేయాలనుకుంటున్నట్లు పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తాము పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నామని, తొలి మ్యాచ్‌లో భారత్‌ను ఓడిస్తే మరింత బలోపేతమవుతామని చెప్పాడు. తాజాగా ఓ పాకిస్థాన్‌ క్రీడాఛానెల్‌తో మాట్లాడుతూ బాబర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఈ ప్రపంచకప్‌లో రిజ్వాన్‌తో కలిసి అతడు ఓపెనింగ్‌ చేస్తానన్నాడు. పరిస్థితులకు అనుగుణంగా జట్టులో మార్పులు చేసుకుంటామని తెలిపాడు. అలాగే మహ్మద్‌ హఫీజ్‌, షోయబ్‌ మాలిక్‌ వంటి సీనియర్లు తమతో ఉండటం జట్టుకు ఉపయోగమన్నాడు. కాగా, టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో భారత్‌, పాక్‌ ఇప్పటి వరకు ఐదుసార్లు తలపడగా అందులో నాలుగుసార్లు టీమ్‌ఇండియానే విజయం సాధించింది. ఒక మ్యాచ్‌ ఫలితం తేలలేదు. ఈ నేపథ్యంలో కోహ్లీసేనపై విజయం సాధించాలని బాబర్‌ ఆశిస్తున్నాడు. అలా చేస్తే రెట్టించిన ఉత్సాహంతో టోర్నీలో ముందుకు సాగుతామని అతడు భావిస్తున్నాడు. ఇక ఈనెల 24న ఇరు జట్లూ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ ఆడనున్న సంగతి తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని