Tokyo olympics: మను భాకర్‌ ముందు మరో అవకాశం

తాజా వార్తలు

Published : 29/07/2021 12:51 IST

Tokyo olympics: మను భాకర్‌ ముందు మరో అవకాశం

టోక్యో: భారత షూటర్‌ మను భాకర్‌కు మరో అవకాశం లభించింది. మహిళల 25మీటర్ల పిస్టల్‌ తొలి అర్హత పోటీల్లో ఐదో స్థానంలో నిలిచింది. ప్రెసిషన్‌లో ఆమె 292-9X స్కోరు సాధించింది. ఆమె సహచరిణి రహి సర్నోబత్‌ 25వ స్థానంలో నిలవడం గమనార్హం. ప్రిసిషన్‌లో ఆమె 287 స్కోరుకే పరిమితమైంది.

ఈ పోటీల్లో మొత్తం 44 మంది షూటర్లు పాల్గొన్నారు. 30 షాట్లకు బాకర్‌ 292 స్కోర్‌ చేయగా రహి 287 చేసింది. రెండో అర్హత పోటీ అయిన ర్యాపిడ్‌ పోరు శుక్రవారం జరగనుంది. మొత్తంగా ఈ రెండు పోటీల్లో కలిపి టాప్-8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ప్రస్తుతం సెర్బియాకు చెందిన జొరానా అరునోవిచ్‌ 296 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. గ్రీస్‌ అమ్మాయి అన్నా కొరకాకి 294తో రెండో స్థానంలో ఉంది.

మూడో రిలేలో బాకర్‌ దూకుడుగా ఆడింది. తొలి రెండు సిరీసుల్లో వరుసగా 97లు సాధిస్తూ వెళ్లింది. మూడో దాంట్లో రెండు 9లు చేయడంతో మొత్తం స్కోరు 98కి చేరుకోవడంతో టాప్‌-5కి చేరుకుంది. ఇక చివరి ఐదు షాట్లలో ఐదు 10లు సాధించడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని