DC Vs KKR Last Over:క్వాలిఫయర్‌-2.. ఆఖరి ఓవర్‌ చూడటం మిస్సయ్యారా?

తాజా వార్తలు

Published : 14/10/2021 20:07 IST

DC Vs KKR Last Over:క్వాలిఫయర్‌-2.. ఆఖరి ఓవర్‌ చూడటం మిస్సయ్యారా?

(Photo: KKR Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌-14 సీజన్‌ క్వాలిఫయర్‌-2లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అదరగొట్టింది. దిల్లీ క్యాపిటల్స్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ..నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (55; 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), శుభమన్ గిల్‌ (46) శుభారంభం అందించారు. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి 92/0తో పటిష్ట స్థితిలో నిలిచింది. తర్వాత ఓవర్‌ నుంచి దిల్లీ బౌలర్లు పుంజుకున్నారు. వరుసగా వికెట్లు పడగొడుతూ కోల్‌కతాను ఒత్తిడిలోకి నెట్టారు. ముఖ్యంగా 17,18,19 ఓవర్లలో దిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఈ ఓవర్లలో 6 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టారు. 

ఆఖరి ఓవర్‌లో నరాలు తెగే ఉత్కంఠ

కోల్‌కతా విజయం సాధించాలంటే ఆఖరి ఓవర్‌లో 7 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేసర్ల కోటా పూర్తవడంతో దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ రవిచంద్రన్ అశ్విన్‌కి బౌలింగ్‌ అప్పగించాడు. అతను తొలి రెండు బంతుల్లో ఒక పరుగే ఇచ్చాడు. మూడో బంతికి షకీబ్‌ని ఎల్బీగా వెనక్కి పంపాడు.తర్వాత బంతికి నరైన్‌ కూడా ఔటవ్వడంతో సమీకరణం రెండు బంతుల్లో ఆరుగా మారింది. దీంతో ఉత్కంఠ మరింత పెరిగింది. దీంతో చాలామంది దిల్లీనే గెలుస్తుందని భావించారు. కానీ, ఐదో బంతికి రాహుల్‌ త్రిపాఠి అద్భుతమే చేశాడు. మరీ షార్ట్‌గా వచ్చిన బంతిని లాంగాఫ్‌ మీదుగా బలంగా బాదాడు. బంతి స్టాండ్స్‌లో పడింది. దీంతో కోల్‌కతా ఫైనల్స్‌కు దూసుకెళ్లగా.. దిల్లీ క్యాపిటల్స్ లీగ్‌ నుంచి నిష్క్రమించింది. మీలో ఎవరైనా ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌ని మిస్సయ్యారా.. అయితే ఇంకేందుకు ఆలస్యం ఆఖరి ఓవర్‌ వీడియోని చూసేయండి.




Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని