వెలుగు వలలో పడిపోతాయి! - Sunday Magazine
close

వెలుగు వలలో పడిపోతాయి!

వాళ్లు పడవేసుకుని వేటకు వెళ్లారంటే చేపలు వాటంతట అవే నీటిపైకి ఎగురుకుంటూ రావాల్సిందే. వల వేయడమే ఆలస్యం కుప్పలుతెప్పలుగా వచ్చి దాన్లో వాలిపోవాల్సిందే. ఇదంతా తైవాన్‌లోని కొంతమంది మత్స్యకారుల చేపల వేట విశేషాలు. చేపలు పట్టడంలో ఎన్నిరకాల టెక్నిక్‌లు వచ్చినా కొన్నివందల ఏళ్లనాటి ‘ఫైర్‌ ఫిషింగ్‌’ విధానాన్ని ఇప్పటికీ పాటిస్తూ తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇంతకీ ఈ ఫైర్‌ ఫిషింగ్‌ ఏంటంటే... మత్సకారులందరూ రాత్రివేళ పడవల్లో బయలుదేరుతారు. చిమ్మచీకట్లో వెలుగులు చిమ్మడానికి ముందుగానే వెదురు బొంగులకు సల్ఫర్‌ ద్రావణాన్ని రాసి సిద్ధం చేసుకుంటారు. ఆ వెదురు కాగడాల్ని వెలిగించగానే నీళ్లలో అటూ ఇటూ దూకే హెర్రింగ్‌, సార్డిన్‌ వంటి చిన్న చిన్న చేపలు ఆకర్షితమై ఒక్కసారిగా పైకెగిరి పడవల్లో సిద్ధంగా ఉంచిన వలల్లోకి అమాంతం దూకేస్తాయి. అలా మొత్తానికి ఒక్కరాత్రే దాదాపు నాలుగు టన్నుల చేపల్ని పడతారట. అలనాటి ఈ ఫిషింగ్‌ కళను కాపాడుకోవడానికి అక్కడి ప్రభుత్వమూ కృషి చేస్తూ రాయితీలిస్తోందట. మెరిసే కాంతుల్లో వలలోకి చిక్కే చేపల అద్భుతమైన దృశ్యాల్ని కెమెరాల్లో బంధించడానికి సందర్శకులూ జాలర్ల వెంట ఈ చేపల వేటకు వెళుతుంటారట!


ఫోటో ఫీచర్‌

వర్షాకాలంలో చల్లగా ఉండే వేళ వేడి వేడి టీ తాగుతుంటే ఆ హాయే వేరు. టీనే కాదండోయ్‌ తీరుగా ఎదిగిన టీ తోటలను చూసినా మనసుకి ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. అందుకే, ప్రపంచంలో చాలా చోట్ల టీ తోటలు పర్యటక ప్రాంతాలుగా ఆకట్టుకుంటున్నాయి. వాటిలో చైనాలోని లాంగ్‌జింగ్‌ గ్రామం మరింత ప్రత్యేకమైంది. ఒకే ఎత్తులో తీరుగా పెంచే అక్కడి టీ తోటల్ని దూరం నుంచి చూస్తే ప్రకృతి గీసిన చూడచక్కని చిత్రలేఖనంలా అనిపిస్తుంది.

Advertisement

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న