లైబ్రరీ.. ఎంత బాగుందీ..! - Sunday Magazine
close

లైబ్రరీ.. ఎంత బాగుందీ..!

పిల్లలకు మంచి అలవాట్లు ఏవైనా బాల్యంలోనే మొదలవ్వాలి. పుస్తకాలు చదవడం అందులో ముఖ్యమైంది. కానీ మామూలుగా ఏదో పుస్తకం ఇచ్చి చదవమంటే వాళ్లు చదవరు. అదే ఏదైనా పార్కుకి వెళ్దామంటే మాత్రం ఎగిరి గంతేస్తారు. అందుకే, సింగపూర్‌ నేషనల్‌ లైబ్రరీ బోర్డు స్థానిక సెంట్రల్‌ లైబ్రరీలో పిల్లలకోసం విడిగా ‘మై ట్రీ హౌస్‌’ పేరుతో చిన్న గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది. ఇది చూడ్డానికి ట్రీ హౌస్‌లా ఉండడంతో పాటు ప్రవేశ ద్వారం దగ్గర్నుంచి లోపలి వరకూ ప్రతిచోటా రకరకాల బొమ్మలు ఉంటాయి. ఇక్కడుండే ఎన్నో రకాల పుస్తకాలను తిరగేస్తూ పిల్లలు నచ్చిన చోట కూర్చుని చదువుకోవచ్చు. కృత్రిమంగా ఏర్పాటు చేసిన చెట్టు పైకి కూడా ఎక్కొచ్చు. ఈ గ్రంథాలయం మొత్తాన్నీ రీసైకిల్‌ చేసిన వస్తువులతోనే నిర్మించడం మరో విశేషం. చెట్టు పైభాగంలో కూడా వాడి పారేసిన ప్లాస్టిక్‌ బాటిళ్లకు రంగులు వేసి ఆకుల్లా అమర్చారు. దీనివల్ల పిల్లలు ఇష్టంగా పుస్తకాలు చదవడంతో పాటు పర్యావరణం గురించి కూడా అవగాహన పెంచుకునే అవకాశం ఉంటుందన్నమాట.


క్లిక్‌.. క్లిక్‌..

గూడు కట్టుకోవడానికి ఎండు పుల్లను కాళ్లతో పట్టుకుని గద్ద గాల్లో ఎగురుతోంది. ఇంతలో మరో బుల్లి పక్షి దాని వెనక ఎగురుకుంటూ వచ్చి ఆ పుల్ల మీద వాలి, కష్టపడకుండా గమ్యాన్ని చేరే ప్లాన్‌ వేసింది. ఈ వి‘చిత్రాన్ని’ అందంగా తన కెమెరాలో బంధించింది మిషిగాన్‌కి చెందిన జోసెలిన్‌ ఆండర్సన్‌.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న