భూ లయ 2.75 కోట్ల ఏళ్లకోసారి!
close

Updated : 15/09/2021 01:56 IST
భూ లయ 2.75 కోట్ల ఏళ్లకోసారి!

భూమి ‘గుండె వేగం’ ఎంతో తెలుసా? అదేంటని ఆశ్చర్యపోకండి. మన గుండె లయ బద్ధంగా కొట్టుకున్నట్టుగానే భూమి మీద పరిణామాలూ.. అగ్ని పర్వతాల పేలుళ్లు, జీవుల మహా అంతర్ధానాలు, భూ ఫలకాల పునర్‌ వ్యవస్థీకరణ, సముద్ర మట్టాలు పెరగటం వంటివన్నీ క్రమ పద్ధతిలో సాగుతుంటాయి. ఇదే ‘భూ లయ’! ఇది చాలా చాలా నెమ్మదిగా.. 2.75 కోట్ల సంవత్సరాలకు ఒకసారి ‘కొట్టుకుంటుంది’ అని న్యూయార్క్‌ యూనివర్సిటీ తాజా అధ్యయనం సూచిస్తోంది. అంటే దీన్ని ఆయా పరిణామాలు పునరావృతం కావటానికి పట్టే కాలమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనం దీని గురించి భయపడాల్సిన పనిలేదు. తదుపరి ‘భూమి నాడి’ కొట్టుకోవటానికి ఇంకా 2 కోట్ల సంవత్సరాల సమయముంది. భూ పరిణామాలు యాదృచ్ఛికంగా, నియమ రహితంగా సంభవిస్తాయని చాలామంది భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. కానీ ఇవి ఒక క్రమ పద్ధతిలో నిర్ణీత కాలంలో కొనసాగుతూ వస్తున్నట్టు తేలటం విశేషం. గత 26 కోట్ల సంవత్సరాల నుంచి 89 దశల్లో సంభవించిన భూ పరిణామ ఘటనలను విశ్లేషించి దీన్ని కనుగొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న