పాత బ్యాటరీల సునామీతో జాగ్రత్త
close

Published : 15/09/2021 01:53 IST
పాత బ్యాటరీల సునామీతో జాగ్రత్త

ర్బన ఉద్గారాల తగ్గింపులో ఎలక్ట్రిక్‌ వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయనటంలో ఎలాంటి సందేహమూ లేదు. అలాగని పర్యావరణానికి అసలే హాని చేయవని అనుకోవటానికి లేదు. ఎలక్ట్రిక్‌ వాహనాలను నడిపించే లిథియం అయాన్‌ బ్యాటరీల రూపంలో ముప్పు పొంచే ఉంటుంది. వీటి తయారీకి లిథియం, నికెల్‌, కోబాల్ట్‌ వంటి ముడి పదార్థాలు పెద్ద ఎత్తున అవసరం. వీటి తవ్వకం వాతావరణం, పర్యావరణం మీద విపరీత ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. అలాగే కాలం చెల్లిన బ్యాటరీలూ ప్రమాదకరమే. 2030 నాటికి 14.5 కోట్ల ఎలక్ట్రిక్‌ వాహనాలు రోడ్ల మీద తిరగొచ్చని.. అప్పటికి 1.2 కోట్ల బ్యాటరీల కాలం చెల్లుతుందని అంచనా. అందుకే పాత బ్యాటరీల పునర్వినియోగం మీద ఇప్పట్నుంచే దృష్టి సారించాలని నిపుణులు చెబుతున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల నుంచి తీసిన తర్వాత కూడా బ్యాటరీల్లో చాలా సామర్థ్యం మిగిలే ఉంటుంది. ఇవి వాహనాలను నడిపించలేకపోవచ్చు గానీ సౌర, పవన విద్యుత్తు వంటి ఇంధనాలను నిల్వ చేసుకోవటానికి ఉపయోగించుకోవచ్చు. ఈ దిశగా ఇప్పటికే కొన్ని సంస్థలు ప్రయత్నాలు ఆరంభించాయి. ఇలా చేయటం ద్వారా ఇంధన నిల్వకు వినియోగిస్తున్న లెడ్‌-యాసిడ్‌ బ్యాటరీల వాడకమూ తగ్గుతుంది. ఇది పర్యావరణ హితానికీ ఉపయోగపడుతుంది. ఎలక్ట్రిక్‌ బ్యాటరీలు పూర్తిగా నిరుపయోగంగా మారాక విడగొట్టటం తప్ప మరో మార్గం లేదనుకోండి. కాకపోతే అదో సంక్లిష్టమైన ప్రక్రియ.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న