పాటల మార్పిడి ఇలా..
close

Published : 13/10/2021 00:56 IST

పాటల మార్పిడి ఇలా..

మరింత స్పష్టంగా, వివిధ దిక్కుల నుంచి సంగీతం వినిపించేలా యాపిల్‌ మ్యూజిక్‌ ఇటీవల కొన్ని మార్పులు చేసింది. స్పోటిఫై వినియోగదారులు కొందరిని బాగా ఆకట్టుకుంటోంది. కాకపోతే యాపిల్‌ మ్యూజిక్‌కు మారిపోతే ఇంతకాలంగా సృష్టించుకున్న ప్లేలిస్టులు పోతాయేమోనని భయం. ఇవన్నీ ఆయా  సందర్భాలకు పనికి వచ్చేలా సృష్టించుకున్నవాయె మరి. కొత్త సర్వీసులో చేరితే ఒకో పాటను, ప్లేలిస్టును మార్చుకోవాల్సి ఉంటుంది. ఇదంత సులువు కాదు. అయితే దీనికో తేలికైన మార్గముంది. అదే సాంగ్‌షిఫ్ట్‌ యాప్‌. దీన్ని యాప్‌స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. తర్వాత యాపిల్‌ మ్యూజిక్‌, స్పోటిఫై అకౌంట్లు రెండింటితో దీనికి కనెక్ట్‌ కావాలి. అనంతరం యాపిల్‌ మ్యూజిక్‌లోకి మార్చుకోవాలని అనుకుంటున్న పాటలు, ఆల్బమ్‌లు, ప్లేలిస్టులను ఎంచుకొని, క్లిక్‌ చేయాలి. అంతే కొద్ది నిమిషాల్లోనే అన్నీ ట్రాన్స్‌ఫర్‌ అవుతాయి. సాంగ్‌షిఫ్ట్‌ యాప్‌ పెయిడ్‌ సర్వీసులోనైతే ఇంకాస్త వేగంగానూ మార్పిడి చేసుకోవచ్చు. కావాలంటే సౌండిజ్‌ యాప్‌నూ ప్రయత్నించొచ్చు. దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవద్దనుకుంటే ఇన్‌-బ్రౌజర్‌ రూపంలోనూ వాడుకోవచ్చు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న