ట్విటర్‌ సాఫ్ట్‌ బ్లాక్‌
close

Published : 13/10/2021 01:07 IST

ట్విటర్‌ సాఫ్ట్‌ బ్లాక్‌

ఫాలోవర్‌ని బ్లాక్‌ చేయకుండా సున్నితంగా తొలగించుకునేలా ట్విటర్‌ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇందుకోసం మన ప్రొఫైల్‌లోకి వెళ్లి ఫాలోవర్స్‌ ఫీచర్‌ను క్లిక్‌ చేయాలి. ఫాలోవర్‌ పక్కనుండే మూడు చుక్కల మెనూను క్లిక్‌ చేస్తే ‘రిమూవ్‌ దిస్‌ ఫాలోవర్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దీన్ని ఎనేబుల్‌ చేసుకోవటం ద్వారా ఫాలోవర్‌ను తొలగించుకోవచ్చు. ఈ విషయం ఫాలోవర్‌కు తెలియదు కూడా. మామూలుగా ఎవరినైనా బ్లాక్‌ చేస్తే వాళ్లకి మన ట్వీట్లు కనిపిస్తూనే ఉంటాయి. డైరెక్ట్‌ మెసేజ్‌ చేసే అవకాశమూ ఉంటుంది. కొత్త ఫీచర్‌తో అలాంటి అవకాశం ఉండదు. మళ్లీ ఫాలో అయితే గానీ మన ట్వీట్లు కనిపించవు. ఒకవేళ ప్రొటెక్టెడ్‌ ట్వీట్స్‌ను కలిగున్నట్టయితే మన అనుమతి తీసుకున్నాకే తిరిగి ఫాలో కావటానికి వీలుంటుంది. పరస్పర దూషణలతో చర్చ వేడెక్కకుండా హెచ్చరించే ఫీచర్‌ మీదా ట్విటర్‌ పరీక్షలు నిర్వహిస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న