వారి ఫొటోలే ముందు
close

Published : 15/09/2021 01:42 IST

వారి ఫొటోలే ముందు

న్‌స్టాగ్రామ్‌ వాడేవారు ఇకపై తమకు ఇష్టమైనవారి ఫొటోలు, వీడియోలే ముందుగా కనిపించేలా చూసుకోవచ్చు. ఇందుకోసం ఇన్‌స్టాగ్రామ్‌ ఫేవరెట్స్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. దీని ద్వారా వినియోగదారులకు తమ ఫీడ్‌లో ఏయే ఖాతాలు ముందుగా కనిపించాలో ఎంచుకోవటానికి వీలు కల్పించనుంది. ఇలా తమకు ఇష్టమైనవారు పోస్ట్‌ చేసే ఫొటోలు, వీడియోలు ముందుగా చూడాలని అనుకునేవారి చిరకాల వాంఛ తీరనుంది. ఫేస్‌బుక్‌ మాదిరిగానే ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పోస్టులు కనిపించటంపై లైక్స్‌, సేవ్‌, కామెంట్స్‌ వంటి రకరకాల అంశాలు ప్రభావితం చేస్తాయి. దీంతో కొన్నిసార్లు తమకు నచ్చినవారి ఫొటోలు, వీడియోలు అడుగుకు వెళ్లిపోవచ్చు. ఇలాంటి ఇబ్బందిని తప్పించటం కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నారు. ఇందులో తమకు ఇష్టమైనవారి ఖాతాలను ఫేవరెట్స్‌గా ఎంచుకుంటే చాలు. వారి ఫీడ్‌ అన్నింటికన్నా ముందు దర్శనమిస్తుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న