ఆన్‌లైన్‌ స్టేటస్‌ కనిపించకుండా..
close

Published : 22/09/2021 01:36 IST

ఆన్‌లైన్‌ స్టేటస్‌ కనిపించకుండా..

వాట్సప్‌ ఓపెన్‌ చేయగానే కాంటాక్టు జాబితాలో ఎవరెవరు ఆన్‌లైన్‌లో ఉన్నారో ఇట్టే తెలిసిపోతుంది కదా. ఇది కొన్నిసార్లు మేలు చేయొచ్చు. కొన్నిసార్లు ఇబ్బంది కలిగించొచ్చు. మనం ఆన్‌లైన్‌లో ఉన్నట్టు తెలిస్తే ఛాట్‌ చేయటానికి సిద్ధంగా ఉన్నామనే అవతలి వాళ్లు భావిస్తుంటారు. నిజానికి అప్పుడు మనం ఏదో పనిలో నిమగ్నమై ఉండొచ్చు. మాటిమాటికి వచ్చే సందేశాలు చికాకుకు గురిచేయొచ్చు. ఆన్‌లైన్‌లో ఉన్నా సమాధానం ఇవ్వటం లేదని అవతలివారు పొరపడే అవకాశమూ ఉంది. మన మీద దురభిప్రాయమూ ఏర్పరచుకోవచ్చు. మరి ఆన్‌లైన్‌లో ఉన్నట్టు అవతలి వాళ్లకి తెలియకుండా ఉండాలంటే? ఇందుకోసం చిన్న చిట్కాను పాటిస్తే ఆన్‌లైన్‌ స్టేటస్‌ కనిపించకుండా చేయొచ్చు.


* ఐఫోన్‌లో- వాట్సప్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి, కింద కుడివైపున ఉండే సెటింగ్స్‌ బటన్‌ ద్వారా అకౌంట్‌ విభాగంలోకి వెళ్లాలి. ప్రైవసీ ఫీచర్‌ను నొక్కితే లాస్ట్‌ సీన్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఇందులో ‘ఎవ్రీవన్‌’ ఎంపికై ఉన్నట్టయితే ‘నోబడీ’ని ఎంచుకోవాలి. దీంతో ఎవరికీ ఆన్‌లైన్‌లో ఉన్నట్టు తెలియదు. కేవలం కాంటాక్ట్‌ జాబితాలో ఉన్నవారికే ఆన్‌లైన్‌ స్టేటస్‌ కనిపించాలంటే ‘మై కాంటాక్ట్స్‌’ను ఎంచుకోవాలి.


* ఆండ్రాయిడ్‌ ఫోన్లలో- వాట్సప్‌ను ఓపెన్‌ చేసి, పైన కుడివైపున నిలువుగా ఉన్న మూడు చుక్కలను నొక్కాలి. అక్కడ్నుంచి సెటింగ్స్‌ ద్వారా అకౌంట్‌కు చేరుకోవాలి. దీని ద్వారా ప్రైవసీలోకి వెళ్లి, లాస్ట్‌సీన్‌ మీద ట్యాప్‌ చేయాలి. ఇందులో ‘నోబడీ’ని ఎంచుకుంటే ఎవరికీ ఆన్‌లైన్‌ స్టేటస్‌ కనిపించదు. ‘మై కాంటాక్ట్స్‌’ను ఎంచుకుంటే కాంటాక్ట్‌ జాబితాలో ఉన్నవారికే స్టేటస్‌ కనిపిస్తుంది. ఒకవేళ అందరికీ కనిపించాలని భావిస్తే ‘ఎవ్రీవన్‌’ను ఎంచుకోవచ్చు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న