ప్రొఫైల్‌ ఫొటోకు బదులు
close

Updated : 06/10/2021 01:55 IST

ప్రొఫైల్‌ ఫొటోకు బదులు

గూగుల్‌ ప్రొఫైల్‌ పిక్చర్‌గా ఫొటోను వాడుకోవటానికి ఇష్టం లేదా? అయితే ఇష్టమైన బొమ్మలను ఎంచుకోండి. ఇందుకోసం గూగుల్‌ ప్రత్యేకంగా ఇలస్ట్రేషన్లను రూపొందించింది. ఇటీవలే తొలి దఫా బొమ్మలను విడుదల చేసింది. జీమెయిల్‌, గూగుల్‌ వర్క్‌స్పేస్‌, ఆండ్రాయిడ్‌ కాంటాక్టులో ప్రొఫైల్‌ పిక్చర్‌ను సెట్‌ చేసుకొని.. కావాల్సిన ఇలస్ట్రేషన్‌ను ఎంచుకోవచ్చు. జంతువులు, పురాణకథల్లోని జీవులు, ప్రాంతాలు, అభిరుచులు.. ఇలా రకరకాల బొమ్మలు ఇందులో ఉన్నాయి. స్నాప్‌ బిట్‌మోజీ, మైక్రోసాఫ్ట్‌ అవతార్ల మాదిరిగా కాకుండా మనలా కనిపించే స్టైలిష్‌ బొమ్మలను ఎంపిక చేసుకోవచ్చు. వివిధ అభిరుచులు, సంస్కృతులు, ఇష్టాయిష్టాలు, నేపథ్యాలను దృష్టిలో పెట్టుకొని వీటిని రూపొందించటం గమనార్హం. జంతు ప్రేమికులు, జిహ్వ చాపల్యం గలవారు, విరివిగా ప్రయాణించేవారు.. ఇలా అన్నిరకాల వారిని సూచించే ఇలస్ట్రేషన్లు ఎన్నో ఉన్నాయి. ఇష్టాన్ని బట్టి వీటి రంగులనూ సరిచేసుకోవచ్చు. బొమ్మ పూర్తిగా కనిపించొద్దని అనుకుంటే కొంత భాగాన్నే సెట్‌ చేసుకోవచ్చు. ఐఓఎస్‌, వెబ్‌ కోసం కొత్త ఇలస్ట్రేషన్లను తీసుకురావాలనీ గూగుల్‌ అనుకుంటోంది. వీటికి మరిన్ని కొత్త బొమ్మలనూ విడుదల చేయనుంది. ఒకవేళ ఇప్పుడు ఇష్టమైన ఇలస్ట్రేషన్‌ దొరక్కపోతే కొద్దిరోజుల తర్వాత ప్రయత్నించి చూడండి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న