Windows 11: విండోస్‌ 11లో ఆండ్రాయిడ్ యాప్స్‌ కోసం ఇలా చేయండి?
close

Published : 11/10/2021 14:53 IST

Windows 11: విండోస్‌ 11లో ఆండ్రాయిడ్ యాప్స్‌ కోసం ఇలా చేయండి?

ఇంటర్నెట్‌డెస్క్‌: మైక్రోసాఫ్ట్ ఎట్టకేలకు సరికొత్త ఫీచర్స్‌తో విండోస్‌ 11 ఓఎస్‌ను విడుదల చేసింది. కొత్త ఓఎస్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఆండ్రాయిడ్ యాప్స్‌ సపోర్ట్ ఫీచర్‌. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంకా యూజర్స్‌కి అందుబాటులో రాలేదు. త్వరలో తీసుకురానున్న అప్‌డేట్‌లో ఈ ఫీచర్‌ని పరిచయం చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఈ ఫీచర్‌ కోసం గేమింగ్ ప్రియులతోపాటు ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ఈ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చే ముందే ఆండ్రాయిడ్ యాప్స్‌ను విండోస్‌ 11 ఓఎస్‌లో ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో చూద్దాం.

విండోస్‌ 11లో ఆండ్రాయిడ్ యాప్స్‌ సపోర్ట్‌ కోసం మైక్రోసాఫ్ట్ ప్రత్యేకమైన సాంకేతికతను ఉపయోగించనుంది. సాధారణంగా ఆండ్రాయిడ్ యాప్స్‌ కంప్యూటర్లలో ఉపయోగించేందుకు ఎమ్యులేటర్లని (కంప్యూటర్లలో ఆండ్రాయిడ్ యాప్‌లు పనిచేసేందుకు ఉపయోగించే సాంకేతికత లేదా యాప్‌) ఉపయోగిస్తుంటాం. అయితే విండోస్‌ 11లో తీసుకొస్తున్న కొత్త సాంకేతికత ఎమ్యులేటర్ల పనితీరుకంటే మెరుగ్గా ఉంటుందని సమాచారం. మైక్రోసాఫ్ట్ ఎనేబుల్ చేసే వరకు వేచి ఉండలేని యూజర్స్ ఎమ్యులేటర్‌ సాయంతో ఆండ్రాయిడ్ యాప్స్‌ని విండోస్ ఓఎస్‌లో ఉపయోగించుకోవచ్చు. అందుకోసం వివిధ రకాల ఎమ్యులేటర్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటి? ఎలా పనిచేస్తాయి? అవి ఏయే యాప్స్‌ని సపోర్ట్ చేస్తాయి? వంటి విషయాలు తెలుసుకుందాం. 


బ్లూస్టాక్స్‌

ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ అనగానే ముందుగా గుర్తొచ్చేది బ్లూస్టాక్స్‌. గత దశాబ్దకాలంగా ఈ ఎమ్యులేటర్‌ ఎంతో పాపులర్‌. విండోస్‌ ఓఎస్‌లో గేమింగ్ యాప్‌లతోపాటు అన్ని ప్రముఖ యాప్‌లను ఉపయోగించుకోవచ్చు. అలానే ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్ వంటి సోషల్‌ మీడియా యాప్స్‌ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. 


నోక్స్‌ప్లేయర్‌

ఇది విండోస్‌, మ్యాక్‌ ఓఎస్‌లను సపోర్ట్ చేస్తుంది. బ్లూస్టాక్స్‌ కంటే ఈ ఎమ్యులేటర్ యాప్‌ పనితీరు మెరుగ్గా ఉంటుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో వేర్వేరు యాప్‌లను ఒకేచోట ఉపయోగించుకోవచ్చు. ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్‌, అమెజాన్‌ వంటి యాప్స్‌ని ఇది సపోర్ట్ చేస్తుంది. అలానే ఈ ఎమ్యులేటర్‌ సాయంతో యాప్‌లలో కూడా మీరు కీబోర్డ్, మౌస్‌ని ఉపయోగించవచ్చు. గేమింగ్‌ యాప్‌లు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. 


ఆండ్రాయిడ్ స్టూడియో

బ్లూస్టాక్స్‌, నోక్స్‌ప్లేయర్‌తో పోలిస్తే ఆండ్రాయిడ్ స్టూడియో ఎమ్యులేటర్ యాప్‌ ఎంతో వేగంగా ఉంటుందని టెక్‌ వర్గాల అభిప్రాయం. గూగుల్ దీన్ని డెవలపర్స్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించింది. దీని సాయంతో యూజర్స్ గెస్చర్‌ సిమ్యులేషన్‌, యాక్సిలెరోమీటర్‌, గైరోస్కోప్‌ సిమ్యులేషన్‌ వంటి ఫీచర్స్‌ని డెవలపర్స్ తాము రూపొందించిన యాప్‌లలో పరీక్షించవచ్చు. అయితే ఇది గేమింగ్ కోసం ఉద్దేశించినది కాదని, కేవలం సాధారణ యాప్స్‌ని మాత్రమే దీని సాయంతో ఉపయోగించవచ్చని టెక్‌ నిపుణులు తెలిపారు.   

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న