Pregnancy Trackers: కాబోయే ‘అమ్మ’ కోసం ట్రాకింగ్‌ యాప్స్
close

Published : 11/10/2021 23:20 IST

Pregnancy Trackers: కాబోయే ‘అమ్మ’ కోసం ట్రాకింగ్‌ యాప్స్

‘అమ్మ’కావడం ప్రతి మహిళ జీవితంలో గొప్ప మధురానుభూతి. బోసిపళ్లతో ఉండే చిన్నారులు అల్లరి చేస్తుంటే ఆనందించని వారు ఉండరు. తను గర్భవతి అని తెలిశాక పుట్టబోయే పసివాడి గురించి కలలు కంటూ.. శిశువు ఆరోగ్యంగా, బలంగా పుట్టాలని మహిళలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. క్రమం తప్పకుండా వైద్యుడి సలహాలను పాటిస్తుంటారు. ఇదే క్రమంలో డిజిటల్‌పరంగానూ ప్రెగ్నెన్సీ ట్రాకర్లను అనుకరించి జాగ్రత్తలు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ట్రాకర్‌ యాప్‌లను వినియోగిస్తున్నప్పటికీ గర్భవతులు వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుని తప్పకుండా పాటించాల్సిందే. ప్రెగ్నెన్సీ యాప్‌లు చాలా ఉన్నప్పటికీ అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం..

స్ప్రౌట్స్‌ ప్రెగ్నెన్సీ

త్రీడీ ఇంటరాక్షన్‌ కలిగిన ట్రాకర్‌ స్ప్రౌట్స్‌ ప్రెగ్నెన్సీ యాప్‌. పొట్టలో శిశువు కదలికలు, కిక్‌లు, హార్ట్‌బీట్‌ వంటి విషయాలను రియలస్టిక్‌గా తెలుసుకునే వీలుంది. డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ వివరాలు, తీసుకోవాల్సిన మెడిసిన్‌, బరువు, శిశువుకు సంబంధించిన విశేషాలను రోజువారీగా, వారంవారీగా సమాచారం విశ్లేషించుకునే అవకాశం ఉంది. శిశువు బరువు, ఆరోగ్యం, శ్వాస సంబంధిత అంశాలు ఎలా ఉన్నాయో చూసుకోవచ్చు. ఐఓఎస్, ఆండ్రాయిడ్‌ యూజర్లకు ఈ యాప్‌ అందుబాటులో ఉంది. ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అయితే కొన్ని సేవల కోసం కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. 

డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి: Sprout Pregnancy


ఓవియా ట్రాకర్

గర్భందాల్చినప్పటి నుంచి ప్రతి రోజూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఓవియా ట్రాకర్‌ యాప్‌ సూచిస్తుంది. కస్టమైజబుల్‌ యాప్‌ అయిన ఓవియాతో శిశువు పుట్టే రోజు వరకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించవచ్చు. ప్రెగ్నెన్సీకి సంబంధించి దాదాపు 2వేల ఆర్టికల్స్‌ అందుబాటులో ఉంటాయి. శిశువు చేతులు, కాళ్ల సైజ్‌ చిత్రాలను చూడొచ్చు. ప్రెగ్నెన్సీ మైల్‌స్టోన్స్‌ను ట్రాక్‌ చేస్తుంది. ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి: Ovia


బేబీ2బాడీ

ప్రెగ్నెన్సీ కన్‌ఫామ్‌ అయ్యాక ఎంతో కేరింగ్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారం నుంచి వ్యాయామం వరకు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యవంతమైన బిడ్డ జన్మిస్తాడు. దాని కోసం బేబీ2బాడీ ట్రాకింగ్‌ యాప్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గర్భవతి అయినప్పుడు.. తర్వాత శిశివుకు జన్మనిచ్చిన తర్వాత తల్లికి ఫిట్‌నెస్‌ ఎంతో కీలకం. ఈ సమయంలో ప్రశాంతంగా ఉండటంతోపాటు శారీరీకంగా ఫిట్‌గా ఉండాలి. దాని కోసం పౌషికాహారం తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ సమయంలో చేయాల్సిన వర్కౌట్లు కూడా బేబీ2బాడీ యాప్‌లో తెలుసుకోవచ్చు. 

డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి: Baby2Body


Glow Nurture

ప్రెగ్నెన్సీ సమయంలో  అనుసరించాల్సిన టిప్‌లను చాలా సులువుగా తెలుసుకునేలా Glow Nurture యాప్‌ను రూపొందించినట్లు డిజైన్‌ సంస్థ పేర్కొంది. యూజర్‌ ఎంట్రీ చేసిన డేటాను బట్టి సూచనలు అందిస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే లక్షణాలు.. వాటి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆర్టికల్స్‌ రూపంలో అందించింది. ప్రెగ్నెన్సీకి సంబంధించి రోజువారీ అప్‌డేట్స్‌, శిశువు పెరుగుదల ఎలా ఉందనే విషయాలను తెలుసుకోవచ్చు. ప్రసవానంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దురదృష్టంకొద్దీ గర్భస్రావం జరిగితే ఏం చేయాలనే విషయాల గురించి చెబుతుంది. 

డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి: Glow Nurture


హెలో బెల్లీ 

ప్రెగ్నెన్సీ సమయంలో మానసికంగా, భావోద్వేగపరంగా దృఢంగా ఉండాలి. శారీరకంగా ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మనస్సు ప్రశాంతంగా ఉంటేనే బిడ్డ పెరుగుదల చక్కగా ఉంటుంది. ఆలోచనలు ఎక్కువైతే దాని ప్రభావం కడుపులోని శిశువుపై ఎదుగుదలపై పడుతుంది. దాని కోసం హెలో బెల్లీ (Hello Belly) యాప్‌ సరైన పరిష్కార మార్గంగా చెప్పొచ్చు. మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉండేందుకు మెడిటేషన్‌, యోగా క్లాసులను అందిస్తోంది. ఆగ్మెంటెడ్‌ రియాల్టీ (ఏఆర్‌) సాంకేతికతతో గర్భంలోని శిశువు ఎలా ఉన్నదో విజువల్స్‌ను  కూడా చూసే అవకాశం ఉంది.

డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి: Hello Belly


సమాచారం షేర్‌ చేయొచ్చు

భారత్‌లో వచ్చిన ప్రెగ్నెన్సీ యాప్‌లలో BabyChakra ఒకటి.  వైద్యులుగా అనుభవం గడించిన వారి పర్యవేక్షణలో బేబీచక్ర యాప్‌ తయారైంది. ఇందులో యాప్‌ యూజర్లు, వైద్యులతో సమాచారాన్ని పంచుకునే వీలుంది. అలానే యాప్‌ను వినియోగిస్తున్న యూజర్లకు మీరు అత్యుత్తమ కంటెంట్‌ను అందించగలిగితే పెయిడ్‌ కంట్రిబ్యూటర్‌గా మారొచ్చు. దాని వల్ల బ్రాండ్‌ స్పాన్సర్‌షిప్‌ను పొంది సంపాదన ఆర్జించే వెసులుబాటు ఉంది. ఇచ్చే సూచనలు, సలహాలు ఇతర యూజర్లకు ఉపయోగపడాలి. అప్పుడే పెయిడ్‌ కంట్రిబ్యూటర్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది.

డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి: BabyChakra

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న