WhatsApp: వాట్సాప్ బీటా యూజర్స్‌.. ఈ వెర్షన్‌ని ఇన్‌స్టాల్‌ చేయొద్దు! 
close

Published : 15/10/2021 21:45 IST

WhatsApp: వాట్సాప్ బీటా యూజర్స్‌.. ఈ వెర్షన్‌ని ఇన్‌స్టాల్‌ చేయొద్దు! 

ఇంటర్నెట్‌డెస్క్‌: యూజర్స్‌కి ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ని పరిచయం చేస్తుంటుంది మెసేజింగ్ యాప్ వాట్సాప్‌. అయితే కొన్ని ఫీచర్స్‌ని పూర్తిస్థాయిలో యూజర్స్‌కి పరిచయం చేసే ముందు పరీక్షల కోసం బీటా వెర్షన్‌ని విడుల చేస్తుంది. బీటా వెర్షన్ కోసం రిజిస్టర్‌ చేసుకున్న యూజర్స్‌ సాధారణ యూజర్స్‌ కంటే ముందుగానే కొత్త ఫీచర్స్‌ని ఉపయోగించవచ్చు. అయితే కొద్దిరోజుల క్రితం వాట్సాప్ విడుదల చేసిన 2.21.21.9 బీటా వెర్షన్‌లో లోపాలున్నట్లు వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటా ఇన్ఫో) వెల్లడించింది. ఈ మేరకు బీటా యూజర్స్ సదరు అప్‌డేట్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవద్దని సూచించింది. 2.21.21.9 అనే అప్‌డేట్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత వాట్సాప్‌ గ్రూప్స్‌ ఓపెన్ చేస్తుంటే అందులో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వాట్సాప్ బీటా ట్విటర్‌లో ట్వీట్ చేసింది. అయితే దీని గురించి బీటా యూజర్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పరీక్షల నిమిత్తం విడుదల చేసే బీటా వెర్షన్స్‌లో ఇలాంటి సమస్యలు వస్తుంటాయని వాబీటా తెలిపింది. 

ఏ వెర్షన్‌ ఉందనేది ఎలా చూడాలంటే?

ఒకవేళ మీరు బీటా వెర్షన్ కోసం రిజిస్టర్ చేసుకుంటే మీ ఫోన్‌లో ఏ వెర్షన్‌ ఉందనేది ఇలా చెక్ చేసుకోండి. ఫోన్‌లో ప్లేస్టోర్ ఓపెన్ చేసి సెర్చ్‌ బార్‌లో వాట్సాప్ అని టైప్ చేయండి. తర్వాత మీకు వాట్సాప్ యాప్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే వాట్సాప్‌కు సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది. దాన్ని కిందకి స్క్రోల్ చేసి ఎబౌట్ దిస్ యాప్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మరో విండో ఓపెన్ అవుతుంది. దాన్ని కిందకి స్క్రోల్‌ చేస్తే యాప్‌ ఇన్ఫోలో వెర్షన్‌ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీ ఫోన్‌లో ఏ వెర్షన్‌ ఉందనేది తెలుస్తుంది. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న