WhatsApp: వాట్సాప్‌కు మాటల్లో చెప్పండి.. అక్షరాల్లో పంపిస్తుంది!
close

Published : 13/09/2021 13:33 IST

WhatsApp: వాట్సాప్‌కు మాటల్లో చెప్పండి.. అక్షరాల్లో పంపిస్తుంది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాగా బిజీ రోడ్‌ మీద రైడ్‌ చేస్తున్నాం. సరిగ్గా అదే సమయానికి వాట్సాప్‌లో ఓ మెసేజ్‌కు సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. రోడ్‌ మీద ఆగలేని పరిస్థితి. అప్పుడేం చేస్తాం..? గూగుల్ అసిస్టెంట్‌ సాయంతో మెసేజ్‌ను పంపేందుకు ప్రయత్నిస్తాం. ఇలా వాయిస్‌ మెసేజ్‌ను టెక్ట్స్‌ రూపంలో పంపేలా ఏర్పాటు ఉంది. ఇదే ఫీచర్‌ను వాట్సాప్‌ తన యూజర్లకు అందుబాటులోకి తీసుకురాబోతోంది. వాయిస్‌ మెసేజ్‌ను టెక్ట్స్ రూపంలోకి మార్చే ఫీచర్‌ను నేరుగా వాట్సాప్‌లోనే యాడ్‌ చేసేందుకు ఇప్పటికే టెస్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు బీటా యూజర్లకూ ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదు. వాట్సాప్‌ కూడా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఐఓఎస్‌ వెర్షన్‌లో ఆడియోను ట్రాన్స్‌క్రైబ్ చేసే సర్వీస్‌ను యాపిల్‌ సంస్థే అందిస్తుంది. ఈ ఫీచర్‌ను వినియోగించి స్పీచ్‌ రికగ్నిషన్‌ను ఇంప్రూవ్‌ చేయాలని యాపిల్‌ సైతం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతానికి ఐఓఎస్‌లో దీన్ని పరీక్షిస్తున్నారు. ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లో కూడా ఈ సదుపాయాన్ని వాట్సాప్‌ తీసుకొచ్చే అవకాశం ఉంది.

వాయిస్‌ మెసేజ్‌ను టెక్ట్స్‌ రూపంలో మార్చే ఫీచర్‌తో పాటు మరో ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు వాట్సాప్‌ ముమ్మర యత్నాలు చేస్తోంది. బ్యాకప్‌ చాట్స్‌ కోసం ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ (e2ee) ప్రైవసీ ఫీచర్‌ను యాడ్‌ చేస్తున్నామని వాట్సాప్‌ ప్రకటించింది. వాట్సాప్‌ మాదిరిగా ఇతర మెసేజింగ్‌ యాప్‌లు ఇలాంటి ప్రైవసీ ఫీచర్‌ను ఇవ్వడం లేదని పేర్కొంది. అయితే ఈ ఫీచర్‌ను యూజర్‌కు ఆప్షనల్‌గా ఎంచుకునే వెసులుబాటు ఉంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఐక్లౌడ్ లేదా గూగుల్‌ డ్రైవ్‌లో చాటింగ్‌ హిస్టరీ బ్యాకప్‌ చేసుకునే యూజర్ల కోసం ఈ సదుపాయం తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ వల్ల బ్యాకప్‌ చేసిన మెసేజ్‌లను కూడా థర్డ్‌పార్టీ (వాట్సాప్‌ సహా) వ్యక్తులు చూడలేరని స్పష్టం చేసింది. ప్రస్తుతం బీటా యూజర్లకు అందుబాటులో ఉందని, మిగతా యూజర్లకూ త్వరలోనే ఈ సదుపాయాన్ని తెస్తామని వెల్లడించింది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న