గుండె పదిలం!

గుండె మీద కొవిడ్‌-19 దుష్ప్రభావాలు అప్పటితోనే ఆగిపోవటం లేదు. దీర్ఘకాలం కొనసాగుతూ వస్తున్నాయి. కొవిడ్‌-19 నుంచి కోలుకున్నాక తొలి 12 నెలల్లో గుండెపోటు, పక్షవాతం వంటి గుండె రక్తనాళాల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు తాజా అధ్యయనం పేర్కొంటోంది. కరోనా జబ్బు

Updated : 12 Oct 2021 00:57 IST

గుండె మీద కొవిడ్‌-19 దుష్ప్రభావాలు అప్పటితోనే ఆగిపోవటం లేదు. దీర్ఘకాలం కొనసాగుతూ వస్తున్నాయి. కొవిడ్‌-19 నుంచి కోలుకున్నాక తొలి 12 నెలల్లో గుండెపోటు, పక్షవాతం వంటి గుండె రక్తనాళాల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు తాజా అధ్యయనం పేర్కొంటోంది. కరోనా జబ్బు తీవ్రతను బట్టి దుష్ప్రభావాలు ఆధారపడి ఉంటాయని అనుకోవటానికీ లేదు. ఆసుపత్రిలో చేరేంత తీవ్రం కాకపోయినా ఏడాది దాటిన తర్వాతా గుండె వైఫల్యం, రక్తనాళాల్లో రక్తం గడ్డల ప్రమాదం ఇంకా పొంచి ఉంటుండటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు గుండెజబ్బు, పక్షవాతం ఇప్పటికే ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఇటీవల కోట్లాది మంది కొవిడ్‌ బారినపడ్డ నేపథ్యంలో తాజా అధ్యయన ఫలితాలు మరింత కలవరం కలిగిస్తున్నాయి. గుండె ఆరోగ్యం విషయంలో ఇప్పుడు ఇంకాస్త పదిలంగా ఉండాలని అన్యాపదేశంగా సూచిస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని